Advertisement

సినీజోష్ ఇంటర్వ్యూ- పవన్ సాధినేని

Wed 30th Mar 2016 05:07 PM
pawan sadhineni interview,savithri movie,nara rohit  సినీజోష్ ఇంటర్వ్యూ- పవన్ సాధినేని
సినీజోష్ ఇంటర్వ్యూ- పవన్ సాధినేని
Advertisement

'ప్రేమ ఇష్క్ కాదల్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన దర్శకుడు పవన్ సాధినేని. ప్రస్తుతం తను డైరెక్ట్ చేసిన 'సావిత్రి' సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు పవన్ సాధినేనితో సినీజోష్ ఇంటర్వ్యూ..

హెవీ ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఉన్న సినిమా..

'ప్రేమ ఇష్క్ కాదల్' సినిమా తరువాత పకడ్బందీగా సినిమా చేయాలని చాలా టైం తీసుకున్నాను. ఆ సినిమా కంటే 'సావిత్రి' ఎక్కువ బడ్జెట్ తో తీశాను. కాని అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చుపెట్టలేదు. హెవీ ప్యాడింగ్ ఆర్టిస్ట్స్ ఉన్న సినిమా ఇది. ప్రతే సీన్ లో సుమారుగా ముప్పై మంది ఆర్టిస్టులు కనిపిస్తారు. అలాంటప్పుడు కొత్త వారితో కంటే తెలిసిన ఆర్టిస్ట్స్ బెటర్ అని అనుభవం ఉన్న నటులతోనే సినిమా చేశాను.

హీరోయిన్ పాత్ర కొత్తగా ఉంటుంది..

పెళ్లి మీద ఇప్పటివరకు చాలా సినిమాలొచ్చాయి. కాని మా సినిమా కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర డిఫరెంట్ గా ఉంటుంది. తను పుట్టడమే పెళ్లిలో పుడుతుంది. చిన్నప్పటినుండి పెళ్ళంటే తనకు చాలా ఇష్టం. అలాంటి అమ్మాయి జీవితంలో రిషి అనే అబ్బాయి వస్తే ఏమవుతుందనేదే కథ.

'సావిత్రి' మాస్ టైటిల్..

ఈ సినిమాకు సావిత్రి అనే టైటిల్ పెట్టడం రిస్క్ అనుకోలేదు. అందరూ.. సావిత్రి అంటే క్లాస్ టైటిల్ అనుకుంటారు కానీ నా దృష్టిలో దీనికి మించిన మాస్ టైటిల్ మరొకటి లేదు. మాస్ ఆడియన్స్ లో కూడా నటి సావిత్రి గారికి మంచి పేరు ఉంది. ఈ టైటిల్ అయితే అందరికి రీచ్ అవుతుందనే ఉద్దేశ్యంతో పెట్టాం. ఈ టైటిల్ వలనే మా బిజినెస్ బాగా జరిగింది. 

విమెన్ సెంట్రిక్ ఫిలిం కాదు..

టైటిల్ విని ఇది విమెన్ సెంట్రిక్ ఫిలిం అనుకుంటే పొరపాటే. నందిత కూడా మొదట విమెన్ సెంట్రిక్ ఫిలిం అనుకొని నటించనని చెప్పింది. కాని కథ విన్నాక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలిసి ఓకే చెప్పింది. జెన్యూన్ ఫ్యామిలీ ఎమోషన్స్ ను సినిమాగా తీశాను. సినిమాలో సావిత్రి ప్రాబ్లం అయితే హీరో దానికి సొల్యూషన్.

రోహిత్ ఈ సినిమాకు స్ట్రెంగ్త్..

రోహిత్ ఈ సినిమాకు పెద్ద స్ట్రెంగ్త్. మొదట తనకు వేరే కథ చెప్పడానికి వెళ్లాను. కాని రోహిత్ కు ఈ కథ నచ్చి సినిమా చేద్దామన్నాడు. ఈ కథలో హీరో సినిమా మొదలయిన 15 నిమిషాల వరకు కనిపించడు. ఆ విషయానికి రోహిత్ ఒప్పుకోడనుకున్నాను కానీ కథకు ప్రాముఖ్యత ఇచ్చి సినిమాలో అందరితో పాటు తను ఉండాలని, తనొక్కడే సినిమాను నడిపించడం పాత కథలా ఉంటుందని ఈ సినిమా చేశాడు. రోహిత్ ఈ సినిమాలో డాక్టర్ పాత్రలో కనిపిస్తాడు. 

ఈ మూడే సినిమాకు హైలైట్స్..

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ సినిమాకు హైలైట్స్ గా నిలుస్తాయి. 

నందిత అయితే కరెక్ట్ అని..

ఈ సినిమాలో హీరోయిన్ గా తెలుగమ్మాయిని తీసుకోవాలనుకున్నాను. సావిత్రి అనే టైటిల్ కు నార్త్ అమ్మాయి బాగోదని నందిత ను సెలెక్ట్ చేసుకున్నాను. ఇమ్మేచ్యూర్డ్ గా 20 సంవత్సరాల అమ్మాయిగా తను బాగా సెట్ అయింది.   

బావుంటే అన్ని సినిమాలు చూస్తారు..

ఏప్రిల్ 1 న చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సినిమా బావుంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. 

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

నాకు కమర్షియల్ సినిమాలంటే చాలా ఇష్టం. ఈ సినిమా రిలీజ్ తరువాత ఏ సినిమా చేయాలో ఆలోచిస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement