Advertisement

బాలకృష్ణ గారు అలా అనడం తప్పు: నందిత

Tue 29th Mar 2016 01:19 PM
savithri movie,nanditha interview,nara rohit  బాలకృష్ణ గారు అలా అనడం తప్పు: నందిత
బాలకృష్ణ గారు అలా అనడం తప్పు: నందిత
Advertisement

'ప్రేమ కథా చిత్రం','లవర్స్','మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ నందిత. ప్రస్తుతం నందిత, నారా రోహిత్ జంటగా నటించిన 'సావిత్రి' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరోయిన్ నందితతో సినీజోష్ ఇంటర్వ్యూ..

మొదట నటించనని చెప్పా..

డైరెక్టర్ పవన్ మొదట నాకు ఫోన్ చేసి 'సావిత్రి' సినిమాలో నటిస్తారా..? అనడిగారు. సావిత్రి అనే టైటిల్ వినగానే ఇదొక విమెన్ సెంట్రిక్ సినిమా అనుకోని నటించనని చెప్పాను. ఇప్పుడే నా కెరీర్ మొదలయ్యింది. ఈ సమయంలో విమెన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నేను నటించలేనని అనుకోని సినిమాకు నో చెప్పాను. ఆ తరువాత పవన్ గారు ఒకసారి కథ వినండని.. వివరించారు. ఆయన కథ చెప్పిన వెంటనే నేను ఓకే చెప్పాను. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. 

సావిత్రికి పెళ్ళంటే చాలా ఇష్టం..

ఈ సినిమాలో సావిత్రి టైటిల్ రోల్ పోషిస్తున్నాను. తనొక పెళ్ళిలో పుడుతుంది. సో.. తను పెళ్లి మీద బాగా ఆసక్తి ఉంటుంది. కుటుంబంతో కలిసి పెళ్లి సెలబ్రేషన్స్ చేసుకోవాలంటే సావిత్రికి బాగా ఇష్టం. తనకొక పెళ్లి సంబంధం కూడా ఖాయమవుతుంది. ఆ సమయంలో రిషి అనే వ్యక్తి సావిత్రి జీవితంలోకి వస్తాడు. సావిత్రి సమస్యైతే.. రిషి దానికి సమాధానం. నిజ జీవితంలో నాకు సావిత్రి పాత్రకు చాలా డిఫరెన్స్ ఉంది. 

రోహిత్ చాలా సైలెంట్..

రోహిత్ తో నాకు పెద్దగా ఇంటరాక్షన్ లేదు. తను ప్రొఫెషనల్ గా ఉంటాడు. చాలా సైలెంట్. తన పని తను చేసుకుంటూ ఉంటాడు. వేరే వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వరు.

పవన్ పాజిటివ్ గా ఆలోచిస్తాడు..

పవన్ ఫెంటాస్టిక్ డైరెక్టర్. ఎప్పడు పాజిటివ్ గానే ఆలోచిస్తాడు. నేను అంత కాన్ఫిడెంట్ గా పాజిటివ్ గా ఆలోచించను. నేను ఏ విషయంలోనైనా.. నెగెటివ్ గా ఉంటే నాకు సర్ది చెప్పేవారు.

బాధ అయితే లేదు..

స్టార్ హీరోల సరసన అవకాశాలు రాలేదనే బాధ అయితే లేదు. కాని ఎందుకు రావట్లేదో.. నాకు తెలియట్లేదు. ప్రతి ఒక్కరు స్టార్ హీరోలతో అవకాశాలు రావాలనే కోరుకుంటారు కదా..!

నేను అనుకున్నవి జరగట్లేదు..

శంకరాభరణం, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ చిత్రాల నుండి నేను చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. కాని నా అంచనాలు తారుమారయ్యాయి. కృష్ణమ్మ కలిపింది హిట్ అయినా.. నేను అనుకున్న ఫేం అయితే రాలేదు. ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు బాధ పడతాను కానీ తొందరగా దాని నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తాను. 

భాష సమస్య ఉండకూడదు..

తమిళం నుండి మంచి అవకాశాలు వచ్చాయి కాని నాకు భాష రాకపోవడం వలన ఒప్పుకోలేదు. అందుకే తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నాను. 

ఆ రోజులు గుర్తుండిపోతాయి..

ఈ సినిమా కోసం నానక్ రామ్ గూడ లో 25 రోజులు షూటింగ్ చేశాం. సెట్స్ లో ఒక ఫ్యామిలీ వాతావరణం ఉండేది. షూటింగ్ చేసిన అన్ని రోజులు నా లైఫ్ లో మర్చిపోలేను.

బాలకృష్ణ గారు అలా మాట్లాడడం తప్పు..

సావిత్రి ఆడియో ఫంక్షన్ లో బాలకృష్ణ గారు అలా మాట్లాడడం తప్పు. స్టేజీ మీద ఉన్న అమ్మాయిలకు ఆ మాటలు వినడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆయన ఏ పరిస్థితుల్లో అలా మాట్లాడారో తెలియదు.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

కథలు వింటున్నాను. ఇంకా ఫైనల్ చేయలేదు అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement