Advertisementt

సేవే 'మా' లక్ష్యం: రాజేంద్రప్రసాద్

Mon 28th Mar 2016 08:28 PM
maa association press meet,rajendra prasad,naresh  సేవే 'మా' లక్ష్యం: రాజేంద్రప్రసాద్
సేవే 'మా' లక్ష్యం: రాజేంద్రప్రసాద్
Advertisement
Ads by CJ

సీనియర్ నరేష్ ఆధ్వర్యంలో 'మా' వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించిన సమగ్ర సర్వే వివరాలను 'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ కు అందజేశారు నరేష్. ఈ వివరాలను తెలియజేసేందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆదివారం హైదరాబాద్ లోని విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ''అసోసియేషన్ లో ఉన్న ముప్పై మంది కళాకారుల పరిస్థితి కష్టంగా ఉంది. ఇరవై మందికి తక్షణ సహాయం అందించాల్సి ఉంది. వీరికి సహాయం అందించే కార్యక్రమాలు చేపడుతున్నాం. 'మా' అసోసియేషన్ ద్వారా ముప్పై మందికి లైఫ్ ఇన్సురన్స్ చేయించాం. ఇఎస్ఐ ద్వారా రెండు లక్షల వరకు ఉచితంగా హెల్త్ చెకప్ చేయించుకునే అవకాశాన్ని అందిస్తున్నాం. అలానే బిజినెస్ చేసుకునే ఆసక్తి ఉన్న వారికి పది లక్షల వరకు ఎలాంటి సెక్యురిటీ లేకుండా ముద్ర బ్యాంక్ ద్వారా రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నాం. ప్రభుత్వం ద్వారా ఇళ్ళను ఇప్పించే ప్రక్రియను మొదలుపెట్టామని'' నరేష్ తెలిపారు.

''ఏకమైన మనస్తత్వాలు ఉన్నవారంతా ఒక్కటై 'మా' అసోసియేషన్ లో సేవలు అందిస్తున్నారు. మేము చేసిన కార్యక్రమాలకు మెచ్చి రెండు వరల్డ్ రికార్డ్స్ ను అందించారు. ఇండియన్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఒకటైతే విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ మరొకటని'' 'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ చెప్పారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ