Advertisement

సినీజోష్ ఇంటర్వ్యూ: అడివి శేష్

Sat 19th Mar 2016 09:08 PM
adivi sesh interview,kshanam movie,ravikanth  సినీజోష్ ఇంటర్వ్యూ: అడివి శేష్
సినీజోష్ ఇంటర్వ్యూ: అడివి శేష్
Advertisement

'కర్మ' సినిమాతో దర్శకునిగా, హీరోగా తెలుగు తెరకు పరిచయమయిన వ్యక్తి అడివి శేష్. ఆ తరువాత పంజా, రన్ రాజా రన్, బాహుబలి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. రీసెంట్ గా తను నటించిన 'క్షణం' సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సందర్భంగా అడివి శేష్ విలేకర్లతో ముచ్చటించారు.

థియేటర్లు పెరిగాయి..

క్షణం సినిమా విడుదలయ్యి నాలుగు వారాలయ్యింది. అయితే రీసెంట్ గా సినిమా థియేటర్లు ఇంకా పెరిగాయి. చాలా సంతోషంగా అనిపించింది. నిజానికి మొదట జీరో బడ్జెట్ లో ఇంగ్లీష్ లో సినిమా చేసి కాన్ ఫిలిం ఫెస్టివల్ కి పంపించాలనుకున్నాం. కాని పివిపి గారికి కథ నచ్చడంతో మాకు పెద్ద ప్లాట్ ఫాం లభించింది. తక్కువ బడ్జెట్ లో సినిమా చేసి సక్సెస్ సాధించాం. సినిమా ఆడిన ఈ నాలుగు వారాలు నా జీవితంలో మర్చిపోలేని రోజులు.

నాకు నచ్చిందే చేయాలని డిసైడ్ అయ్యాను..

'కర్మ' సినిమా తరువాత డైరెక్టర్ గా 'కిస్' సినిమా చేశాను. అది పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. కాని అందులో ఒక విలువైన పాయింట్ చెప్పాను. అందరికి సినిమాలో కొన్ని కొన్ని సీన్లు నచ్చాయి కాని ఓవరాల్ గా సినిమా నచ్చలేదు. ఆ సినిమా తరువాత నేను కొంచెం గ్యాప్ తీసుకొని నా ప్యాషన్ ను డెవలప్ చేసుకున్నాను. ఆ సమయంలో నా మనసుకు నచ్చింది మాత్రమే చేయాలని ఫిక్స్ అయ్యాను. అలా చేస్తేనే మంచి రిజల్ట్ వస్తుంది. అలా నేను చేసిన 'రన్ రాజా రన్','లేడీస్ అండ్ జెంటిల్మెన్','బాహుబలి','దొంగాట' ఇలా ప్రతి సినిమా మంచి విజయాన్ని అందించింది. ఏ ఒక్క నిర్మాత కూడా లాస్ అవ్వలేదు.

అబ్బూరి రవి సహకారం ఉంది..

ఈ సినిమాకు నేను, రవికాంత్ కలిసి స్క్రీన్ ప్లే రాసుకున్నాం. అయితే అబ్బూరి రవి గారు మా కథను, స్క్రీన్ ప్లే ను పాజిటివ్ గా తీసుకొచ్చారు. జెన్యూన్ టీం వర్క్ గా చేశాం.

రెండు ఒకసారి చేయలేను..

'క్షణం' సినిమాకు దర్శకత్వం చేయాలని నేను అనుకోలేదు. నేను నటించే సినిమాను నేను డైరెక్ట్ చేయను. రెండు పనులు ఒకేసారి చేయలేను. ఏదైనా ఒక్కటే చేస్తాను. బహుశా ఫ్యూచర్ లో నా నిర్ణయాన్ని మార్చుకోవచ్చు. ప్రస్తుతం అయితే నటించడమో, డైరెక్ట్ చేయడమో ఏదో ఒక్కటి మాత్రమే చేస్తాను.

హిందీ రీమేక్ చేస్తున్నారు..

ఈ సినిమా బాలీవుడ్ రీమేక్ రైట్స్ సాజిత్ గారు ఫ్యాన్సీ రేట్ కు కొన్నారు. పెద్ద ప్లాట్ ఫాంలో సినిమా చేస్తున్నారని విన్నాను. 

ఎక్కడా కాపీ చేయలేదు..

నా శ్రేయోభిలాషులు, స్నేహితులు కొంతమంది సినిమాను కాపీ చేసారని బయట మాట్లాడుకుంటున్నారని చెప్పారు. కొన్ని సినిమా సీన్లను యాడ్ సినిమా చేశామనే గాసిప్స్ వినిపించాయి. మేము ఏ సినిమాను కాపీ చేయలేదు. ఇది ఒరిజినల్ స్క్రిప్ట్.

ఏ పాత్రలో అయినా నటిస్తాను..

నాకు ఇష్టమైన నటుడు ఎస్.వి.రంగారావు గారు. ఆయన ఏ పాత్రలో అయిన నటించగలడు. నేను హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని చూడను. నాకు పాత్రను డిఫైన్ చేయగలిగే పాత్రల్లో నటిస్తాను. 'క్షణం' సినిమా తరువాత హీరోగా ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. నా వరకు నేను హీరో, విలన్ అని ఫిక్స్ అవ్వలేదు.

ఊపిరిలో కామియో..

ఊపిరి సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తాను. వంశీ గారు నటించమని అడిగేసరికి కాదనలేకపోయాను. నా పార్ట్ పారిస్ లో షూట్ చేశారు.

రవికాంత్ కు మంచి అవకాశాలు వస్తున్నాయి..

ఈ సినిమా అందరికి సమాన విజయాన్ని అందించింది. దర్శకుడు రవికాంత్ కు పెద్ద బ్యానర్స్ నుండి, పెద్ద హీరోలను డైరెక్ట్ చేసే అవకాశాలు వస్తున్నాయి.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

బాలీవుడ్ లో నటించమని అడుగుతున్నారు. అలానే తెలుగులో కూడా కొన్ని అవకాశాలు వచ్చాయి కాని ఇంకా ఏది సైన్ చేయలేదు అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement