Advertisement

నా లైఫ్ చేంజింగ్ ఫిలిం: నాగార్జున

Fri 18th Mar 2016 01:57 PM
nagarjuna intervie,oopiri cinema,karthi,thamanna,vamsi paidipalli  నా లైఫ్ చేంజింగ్ ఫిలిం: నాగార్జున
నా లైఫ్ చేంజింగ్ ఫిలిం: నాగార్జున
Advertisement

'మనం','సోగ్గాడే చిన్ని నాయన' చిత్రాలతో బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంత చేసుకున్న నాగార్జున 'ఊపిరి' సినిమాతో హ్యాట్రిక్ కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తి, తమన్నాలు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 25న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో నాగార్జునతో సినీజోష్ ఇంటర్వ్యూ..

కథ తెలిసిన వెంటనే ఓకే చెప్పాను..

నాలుగేళ్ళ క్రితం ఫ్రెంచ్ ఫిలిం 'ఇన్ టచబుల్స్' చూశాను. అప్పుడే ఈ సినిమాను తెలుగులో తీస్తే చాలా బావుంటుందనుకున్నాను. అయితే అదే కథను వంశీ, పివిపి గారు సినిమా చేద్దామని నా దగ్గరకి వచ్చారు. నేను ఒప్పుకోకపోతే సినిమా చేయకూడదని అనుకున్నారు. నాకు ఎప్పుడైతే అది ఇన్ టచబుల్స్ సినిమా అని తెలిసిందో వెంటనే ఓకే చెప్పేశాను. కాని మక్కీకి మక్కీ సినిమా చేస్తే తెలుగు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అందుకే తెలుగు నేటివిటీకు తగ్గట్లుగా సినిమా చేశారు. 

ఆ ఇద్దరి కథే సినిమా..

ఈ సినిమాలో విక్రమ్ ఆదిత్య అనే పాత్రలో నటించాను. వీల్ చైర్ కు పరిమితమైన విక్రమ్ ఆదిత్య ఓ బిలీనియర్. డిగ్నిటీగా పవర్ ఫుల్ గా ఉండే పాత్ర. అన్నీ.. ఉన్న తనకో మంచి స్నేహితుడు ఉండడు. అందరూ తననొక బాస్ లా చూడడమే తప్ప స్నేహంగా ఉండలేరు. మాట్లాడానికి కూడా భయపడతారు. అలాంటి వ్యక్తికి స్లం లో నుండి వచ్చిన వ్యక్తి స్నేహితుడైతే ఎలా ఉంటుంది. వారిద్దరి స్నేహం ఎలాంటి ఎమోషన్స్ కు దారి తీసిందనేదే.. సినిమా. వీరిద్దరి మధ్య తమన్నా ఓ ఆడియన్ లా ఉంటుంది.

చాలా కష్టంగా అనిపించేది..

వీల్ చైర్ లో ఉండే పాత్ర కాబట్టి కేవలం ముఖ కదలికలతోనే సినిమా మొత్తం నటించాలి. నా చేతి వేలు కూడా కదల్చకూడదు. దానికి ప్రత్యేకంగా ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ను పెట్టి గమనించమనేవారు. మొదట్లో చాలా కష్టంగా అనిపించేది. వంశీకు ముందుగానే అసలు హెసిటేట్ చేయకుండా ఎన్ని టేక్స్ అయినా తీసుకోమని చెప్పాను. తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరించడం వలన కూడా కొంచెం కష్టంగా అనిపించేది. ఒక్కోసారి చాలా టేక్స్ తీసుకుంటుంటే 'నాకు యాక్షన్ రాదా.. అనిపించేది'. ఫైనల్ గా రిజల్ట్ చూసిన తరువాత చాలా సంతోషంగా అనిపించింది.

ప్రతి సీన్ కొత్తగా ఉంటుంది..

ఈ సినిమాలో ప్రతి సీన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఏ సినిమాలో చూడని విధంగా ఉంటుంది. రామారావు గారు, నాన్నగారు ఒక్కప్పుడు 'డాక్టర్ చక్రవర్తి','బాటసారి' లాంటి భిన్నమైన చిత్రాల్లో నటించేవారు. డిఫరెంట్ గా ఉండే పాత్రల్లో నటించేవారు. కాని 1980 నుండి అలాంటి సినిమాల్లో ఎవరు నటించట్లేదు. 2015 నుండి కొత్త జోనర్స్ లో కొత్త సినిమాలు వస్తున్నాయి. నాని నటించిన 'భలే భలే మగాడివోయ్' సినిమాలో ప్రతి సీన్ చాలా కొత్తగా అనిపిస్తుంది. నాని బాగా నటించాడు.

ప్రతి ఒక్కరికి తోడు కావాలి.. 

శారీరకంగా, మానసికంగా సమస్యలున్న వారికి తోడు అనేది ఉంటే వారు చాలా ఆనందంగా జీవిస్తారు. ఫ్రెంచ్ సినిమా చూసి నేను ఇన్స్పైర్ అయింది కూడా ఆ విషయంలోనే. మేము ఏదైతే అనుకున్నామో.. అదే తెరపై ప్రెజంట్ చేసాం. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందుతారు.

కార్తిను చూసి సిగ్గేసేది..

కార్తి మంచి మనిషి. తనే కాదు తన కుటుంబమంతా అంతే. సూర్య, శివకుమార్ గారు ఇలా ప్రతి ఒక్కరు మంచి గుణాలు ఉన్నవారే. కార్తి డెడికేటెడ్ పెర్సన్. కొన్ని సీన్స్ లో తను నటిస్తుంటే.. అలా చూస్తూ ఉండిపోయేవాడ్ని. జయసుధ గారు కూడా అదే విషయాన్ని చెప్పారు. నాకు కార్తిను చూసి సిగ్గేసేది. తెలుగు రాకపోయినా.. నేర్చుకొని చక్కగా డైలాగ్స్ చెప్తున్నాడు.. నేను తమిళంలో ఎందుకు సరిగ్గా చెప్పలేకపోతున్నానని అనుకునేవాడ్ని. ఈ సినిమాతో కార్తి తెలుగు ఆడియన్స్ కు దగ్గరవుతాడు. 

కార్తి వలనే చెప్పా..

ఈ సినిమా తమిల్ డబ్బింగ్ కూడా నేనే చెప్పాను. నిజానికి కార్తి నాకు ఫోన్ చేసి మీరు చెప్తేనే బావుంటుందని అనడంతో వెళ్లి డబ్బింగ్ చెప్పాను. మొత్తం షూటింగ్ లో అదే కష్టంగా అనిపించింది. కొన్ని కొన్ని పదాలు పలకడంలో ఇబ్బందిగా అనిపించేవి.

నాకు లైఫ్ చేంజింగ్ ఫిలిం..

ఊపిరి ఓ మంచి సినిమా అవుతుంది. నా కెరీర్ లో ఇదొక లైఫ్ చేంజింగ్ ఫిలిం అవుతుంది. నేను నటించిన శివ, గీతాంజలి, నిన్నే పెళ్ళడతా, అన్నమయ్య చిత్రాల కోవలోకే ఈ సినిమా కూడా వస్తుంది. ఈ సినిమా తరువాత రచయితలు నాగార్జున ఏ పాత్రలో అయినా.. నటించగలడనే ఉద్దేశ్యంతోనే కథలు రాసుకుంటారు. 

కార్తి స్థానంలో ఎన్టీఆర్ అనుకున్నాం..

ఈ సినిమాలో మొదట కార్తి స్థానంలో ఎన్టీఆర్ అనుకున్నాం. తారక్ కి కూడా కథ బాగా నచ్చింది. కాని ఎన్టీఆర్ కు, నాకు డేట్స్ విషయంలో సెట్ కాకపోవడం వలన కుదరలేదు. లేట్ అయిపోతుంది.. ప్రొసీడ్ అయిపోమని చెప్పాడు. అయితే ఈ విషయాలన్నీ స్క్రిప్ట్ సిద్ధం కాకముందు మాట్లడుకున్నవే...

ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ వర్క్ చేశారు..

ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతి హాసన్ ను అనుకోవడం తను మధ్యలో తప్పుకోవడం జరిగాయి. నిజానికి సినిమా షూటింగ్ 2015 మార్చి లో ప్రారంభించాం. తొమ్మిది నెలల్లో షూట్ చేసేసాం. ప్రీ ప్రొడక్షన్ కోసం సుమారుగా ఆరు నెలల పాటు వర్క్ చేశారు. 

ఆల్మోస్ట్ అన్నీ రీషూట్స్ చేసినట్లే..

పివిపి గారికి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఎక్కువ బడ్జెట్, తక్కువ బడ్జెట్ సినిమాలని కాకుండా కొత్త సినిమాలను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాను రెండు భాషల్లో నిర్మించడం వలన కొన్ని సీన్స్ మార్చాల్సి వచ్చింది. పాటలు కూడా తమిల్ కు, తెలుగుకి చాలా వేరియేషన్ ఉంటుంది. ఆల్మోస్ట్ అన్నీ రీషూట్స్ చేసినట్లే చేశాం.

అనుష్క నటిస్తోంది..

ఈ సినిమాలో అనుష్క అతిధి పాత్రలో కనిపిస్తోంది.

అఖిల్, వంశీ మాట్లాడుకుంటున్నారు..

అఖిల్ తదుపరి సినిమా అంటే ఒక హిందీ రీమేక్ సినిమా, అలానే రెండు కథలు కూడా ఉన్నాయి. అయితే అఖిల్ మాత్రం వంశీ పైడిపల్లి తో డిస్కషన్స్ పెడుతున్నాడు. వారిద్దరూ.. ఏదొకటి నిర్ణయించుకొని నాకు చెప్తారు. ఆ విషయాన్ని ఏప్రిల్ నెలలో అనౌన్స్ చేస్తాను. అలానే నాగచైతన్య. కళ్యాన్ కృష్ణ సినిమా పనులు జరుగుతున్నాయి.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

ప్రస్తుతానికి రాఘవేంద్రరావు గారితో ఓ సినిమా చేయనున్నాను. మే నెల నుండి ఆ సినిమా ప్రారంభమవుతుంది అంటూ ఇంటర్వ్యూ ముగించారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement