సినీజోష్ ఇంటర్వ్యూ: తమన్నా

Wed 16th Mar 2016 09:32 AM
thamanna interview,oopiri movie,nagarjuna,karthi  సినీజోష్ ఇంటర్వ్యూ: తమన్నా
సినీజోష్ ఇంటర్వ్యూ: తమన్నా
Sponsored links

తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరనస నటించి టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతోన్న హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా. 'బాహుబలి' సినిమాతో ఇంటర్నేషనల్ రేంజ్ సొంతం చేసుకున్న ఈ భామ ప్రస్తుతం హీరోయిన్ గా నటిస్తోన్న 'ఊపిరి' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా తమన్నా చిత్ర విశేషాల గురించి విలేకర్లతో ముచ్చటించారు. 

ఊపిరి ఆడలేదు..

ఈ సినిమాలో బిలియనీర్ పెర్సనల్ అసిస్టెంట్ పాత్రలో కనిపిస్తాను. నా క్యారెక్టర్ పేరు కీర్తి. ప్రెజంట్ జెనరేషన్ కు తగ్గట్లుగా ఉండే అమ్మాయి. మొండిగా, బాధ్యతగా, ముక్కుసూటిగా మాట్లాడే అమ్మాయి. కొత్త లుక్ తో కనిపిస్తాను. నా పాత్రకు టైట్ గా ఉండే బట్టలనే ప్రిఫర్ చేశారు. ఆ బట్టలతో నాకు ఊపిరి ఆడేది కాదు. 

డబ్బింగ్ నేనే చెప్పాలనుకున్నాను..

ఈ సినిమాలో మొదటిసారిగా నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. ఎప్పటినుండో చెప్పాలనుకున్నాను. ఈ సినిమాతో డబ్బింగ్ మొదలుపెట్టడం కరెక్ట్ అని భావించి చెప్పాను. డైరెక్టర్ వంశీకు వెళ్లి నా ఐడియా చెప్పాను. ఆయనకు నచ్చి ఓకే చెప్పడంతో స్టార్ట్ చేశా.. అయితే నా వాయిస్ ప్రేక్షకులకు నచ్చితే భవిష్యత్తులో ఖచ్చితంగా నా సినిమాలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను. ఈ చిత్రాన్ని రెండు భాషల్లో చిత్రీకరించారు. తమిళంలో మాత్రం నేను డబ్బింగ్ చెప్పలేదు. 

ఊపిరి రీమేక్ కాదు..

ఊపిరి సినిమా ఫ్రెంచ్ ఫిలిం 'ఇన్ టచబుల్స్' కు రీమేక్ అని చెప్పలేం. ఫ్రెంచ్ ఫిలిం తెలుగు ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారో చెప్పలేం. ఆ సినిమా అడాప్ట్ చేసుకొని ఊపిరి చిత్రీకరించారు. నా పాత్రను కంప్లీట్ గా మార్చేశారు. నిజానికి నేను ఒరిజినల్ ఫిలిం చూడలేదు. కాని సెట్ లో ఎప్పడు డిస్కస్ చేస్తుండడం వలన నా పాత్రలో చాలా మార్పులు చేసారని అర్ధమయింది.

ఛాలెంజింగ్ రోల్ లో నటించారు..

ఒక నటుడు సినిమా అంతా వీల్ చైర్ లో కూర్చొని ఉండడం అంటే చాలా కష్టమైన విషయం. శరీరంలో ఏ భాగం కదల్చకుండా కేవలం ముఖ కదలికలతో నటించాలి. అలాంటి ఛాలెంజింగ్ రోల్ లో నాగార్జున గారు నటించారు. ఆయనను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. తెలుగు ఇండస్ట్రీలో మార్పోస్తుంది. ప్రేక్షకులు కూడా కొత్తదనానికే ఓటేస్తున్నారు.

నిజమైన బైలింగ్యువల్ సినిమా ..

నిజమైన బైలింగ్యువల్ సినిమా అంటే ఇదే. రెండు గౌరవమైన ఇండస్ట్రీల నుండి ఇద్దరు పెద్ద హీరోలు కలిసి నటిస్తున్నారు. అలానే నేను బొంబాయి అమ్మాయిని. సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ కొందరు తెలుగు వాళ్ళుంటే మరికొందరు తమిళం నటులున్నారు.

ఒకేసారి 10 సినిమాల్లో నటించలేను..

ఎక్కువ సినిమాల్లో ఎందుకు నటించట్లేదని అందరూ అడుగుతున్నారు. ఊపిరి సినిమా చేయడానికి సుమారుగా ఒక సంవత్సరం సమయం పట్టింది. అలానే బాహుబలి సినిమా ఎంత సమయం తీసుకుంటుందో చెప్పలేను. ప్రభుదేవా గారితో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న మరో సినిమాలో నటిస్తున్నాను. ఇలా ఎక్కువగా బైలింగ్యువల్ చిత్రాలలో నటించడం వలన సమయం ఎక్కువ తీసుకుంటుంది. నాకు సంవత్సరానికి 10 సినిమాల్లో నటించడం నచ్చదు. మంచి సినిమాల్లో నటించానా..? లేదా..? అనే చూసుకుంటాను. 

ప్రతి పాత్ర భిన్నంగా ఉంటుంది..

బాహుబలి సినిమాలో ఓ వారియర్ పాత్రలో నటించాను. ఈ సినిమాలో వెస్ట్రన్ అమ్మాయి పాత్రలో నటించాను. దేనికదే భిన్నంగా ఉండేలా పాత్రలను ఎంపిక చేసుకుంటున్నాను. నేనొక వెర్సటైల్ యాక్టర్ గా నిరూపించుకోవాలి. నటిగా అన్ని రకాల పాత్రల్లో నటించాలనుకుంటున్నాను.

స్పెషల్ సాంగ్స్ కోసం ఎదురుచూడను..

స్పెషల్ సాంగ్స్ లో నటించమని అవకాశాలు వచ్చినపుడు నాకు నచ్చితేనే నటిస్తాను. అంతేకానీ.. వాటి కోసం ప్రత్యేకంగా ఎదురుచూడను. 

కార్తి నటుడిగా ఎదిగాడు..

కార్తితో ఇదివరకు రెండు చిత్రాల్లో నటించాను. అప్పటికి ఇప్పటికి తను నటుడిగా ఎంతో ఎదిగాడు. నటులెవరైనా.. మెథాడికల్ గా లేదా స్పాంటేనియస్ గా నటిస్తారు. కార్తి మాత్రం ఆ రెండింటిని బ్యాలన్స్ చేస్తూ నటిస్తాడు. 

పెర్సనల్ గా నాకు నచ్చిన సినిమా..

'మిస్టర్ పెర్ఫెక్ట్' సినిమాలో మొదట నటించమని అడిగారు కాని నాకు ఆ సమయంలో కుదరలేదు. పెర్సనల్ గా  నాకు ఆ సినిమా అంటే చాలా ఇష్టం అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019