Advertisement

సీనియర్ నరేష్ కు డాక్టర్ ఆఫ్ ఆర్ట్స్ అవార్డు!

Sun 06th Mar 2016 05:29 PM
senior naresh,doctor of arts award,academy of universal global peace  సీనియర్ నరేష్ కు డాక్టర్ ఆఫ్ ఆర్ట్స్ అవార్డు!
సీనియర్ నరేష్ కు డాక్టర్ ఆఫ్ ఆర్ట్స్ అవార్డు!
Advertisement

అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ సంస్థ అన్ని రంగాల్లో నిష్ణాతులైన వారికి అవార్డులను బహుకరిస్తుంటుంది. ఇందులో భాగంలో సౌత్ నుండి డాక్టర్ ఆఫ్ ఆర్ట్స్ పేరిట నటుడు సీనియర్ నరేష్ కు డాక్టరేట్ అవార్డు వచ్చింది. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.. ''నా ఏడవ ఏట నుండి సినిమాల్లో నటిస్తున్నాను. ఇప్పటివరకు సుమారుగా 150 సినిమాలకు పైగా నటించాను. న్యూయార్క్ బేస్డ్ యూనివర్సిటీ అయిన అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ సంస్థ వారు నా ప్రొఫైల్ చూసి డాక్టర్ ఆఫ్ ఆర్ట్స్ అవార్డు బహూకరించడం చాలా సంతోషంగా ఉంది. మార్చి 5న శనివారం బెంగులురులోని ఓ హోటల్ లో ఏ.యు.జి.పి చైర్మన్ ఏలూరు శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈ అవార్డు ప్రధానోత్సవం జరిగింది. ఆ అవార్డును నా గురువులైన జంధ్యాల గారికి, విజయనిర్మల గారికి, సూపర్ స్టార్ కృష్ణ గారికి, నా దర్శకులకు,  తెలుగు సినిమా ప్రేక్షకులకు అంకితం చేస్తున్నాను. నేను నటించిన ఇన్ని సంవత్సరాల్లో ఎలాంటి బిరుదులు తీసుకోలేదు. కాని రీసెంట్ గా తెలంగాణా స్పీకర్ నవరసరాయ అనే బిరుదినిచ్చారు. సూపర్ స్టార్ కృష్ణగారు నటించిన 'శ్రీ శ్రీ' సినిమాలో నేనొక ఇంటెన్స్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాను. మొదటిసారి ఈ సినిమాలో 'నవరసరాయ డాక్టర్ నరేష్' అని ముప్పలనేని శివ గారు స్క్రీన్ నేమ్ వేయాలనుకుంటున్నారు. 2016వ సంవత్సరం నాకు అధ్బుతంగా ఉంది. ఈ అవార్డుతో నటుడిగా నాపై బాధ్యత మరింత పెరిగింది. 'చిత్రం భళారే విచిత్రం' ,'మీ శ్రేయోభిలాషి','అందరి బంధువయ' రీసెంట్ గా రిలీజ్ అయిన 'గుంటూర్ టాకీస్' చిత్రాలతో నరేష్ ఏ పాత్రలో అయిన నటించగలడని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. గుంటూర్ టాకీస్ సినిమా నటునిగా నా కెరీర్ ను 10 మెట్లు ముందుకు తీసుకువెళ్ళింది. ప్రస్తుతం త్రివిక్రమ్ గారి సినిమాలో, బ్రహ్మోత్సవం చిత్రాల్లో నటిస్తున్నాను. వీరుపోట్ల డైరెక్షన్ లో సునీల్ హీరోగా నటిస్తున్న మరో చిత్రంలో ఓ కీ రోల్ పోషిస్తున్నాను. అలానే మరో ఆరు సినిమాలు పరిశీలనలో ఉన్నాయి'' అని చెప్పారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement