Advertisement

సినీజోష్ ఇంటర్వ్యూ: శ్రద్ధాదాస్

Thu 03rd Mar 2016 07:40 PM
sraddha das interview,guntur talkies,praveen sattharu  సినీజోష్ ఇంటర్వ్యూ: శ్రద్ధాదాస్
సినీజోష్ ఇంటర్వ్యూ: శ్రద్ధాదాస్
Advertisement

సిద్ధు జొన్నలగడ్డ, రష్మి గౌతమ్, శ్రద్దా దాస్ ప్రధాన పాత్రల్లో ఆర్.కె.స్టూడియోస్ బ్యానర్ పై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఎమ్.రాజ్ కుమార్ నిర్మిస్తున్న సినిమా 'గుంటూర్ టాకీస్'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రద్ధాదాస్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

కంగనారనౌత్ లుక్ లో కనిపిస్తా..

ఈ సినిమాలో రివాల్వర్ రాణి పాత్రలో కనిపిస్తాను. నా నిజ జీవితానికి ఈ పాత్రకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆడియన్స్ కు కూడా నా పాత్ర షాకింగ్ గా ఉంటుంది. కంగనారనౌత్ లుక్ లో కనిపిస్తా.. బోల్డ్ క్యారెక్టర్ లో నన్ను చూస్తారు. ఇది నాకు చాలెంజింగ్ రోల్ అనిపించింది. రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాను. ఫుల్ లెంగ్థ్ రోల్. 

కన్ఫ్యూషన్ కామెడీ..

'గుంటూర్ టాకీస్' ఓ కన్ఫ్యూషన్ కామెడీ మూవీ. ఈ సినిమాలో ప్రవీణ్ సత్తారు నన్ను సెలెక్ట్ చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు డైరెక్టర్ కాకపోతే నేను అసలు నటించేదాన్ని కాదు. తెలుగులో ఏ హీరోయిన్ ఈ పాత్రలో నటించడానికి అంగీకరించాడు. రివాల్వర్ రాణి పాత్రలో నటించడానికి గట్స్ ఉండాలి. స్ట్రాంగ్ రోల్ నాది. ఈ సినిమాలో నాతో పాటు, రష్మి, సిద్ధూ లు కలిసి నటించారు. రష్మితో నాకు ఎలాంటి సీన్స్ లేవు. సాధారణంగా ప్రతి సినిమాలో విలన్ అమ్మాయిని ఎత్తుకుపోతాడు. ఈ సినిమాలో నేను సిద్ధూను ఎత్తుకు పోతాను.

రియల్ గన్స్ ఉపయోగించాం..

రివాల్వర్ రాణి పాత్ర కోసం నిజమైన గన్స్ ను ఉపయోగించాం. ఏకె 47 ఇంకా మరి కొన్ని గన్స్. నా రెండు చేతుల్లో గన్స్ పట్టుకొని ఉండాలి. అవేమో చాలా బరువు ఉండేవి. బుల్లెట్స్ మాత్రం డమ్మీవే. కాని గన్ ఫైర్ చేస్తుంటే పెద్ద పెద్ద సౌండ్స్  వచ్చేవి. తట్టుకోలేక చెవిలో కాటన్ పెట్టుకునేదాన్ని. నా మొహం మీదకు స్పార్కల్స్ కూడా వచ్చేవి. అలాంటి పరిస్థితుల్లో కూడా నా కళ్ళు తెరిచే ఉండాలని డైరెక్టర్ చెప్పేవారు.

నాకు డౌట్ వచ్చి ప్రవీణ్ ను అడిగా..

ఈ సినిమాలో నన్ను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రవీణ్ ను అడిగాను.. నేను చేయగలనని అనుకుంటున్నావా..? అని. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఇలాంటి పాత్రల్లో నటించలేదు. ఈ పాత్రను ప్రేక్షకులు హేట్ చేయొచ్చు, లేదా శ్రద్ధ ఎలా ఒప్పుకుంది అనుకోవచ్చు, లేదా శ్రద్ధ ఇలాంటి పాత్రలు కూడా పండించగలదు.. ఇలా రకరకాలుగా అనుకునే అవకాశాలు ఉన్నాయి. కాని సినిమాలో ఎలాంటి వల్గారిటీ ఉండదు.

ఇమేజ్ ను పట్టించుకోను..

నేను ఇమేజ్ గురించి పట్టించుకునే మనిషిని కాను. మంచి క్యారెక్టర్ వచ్చిందా.. నా బెస్ట్ పెర్ఫార్మ్ చేశానా..? అనే విషయాలు మాత్రమే పట్టించుకుంటాను. ఈ సినిమాకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. నా తెలుగు కొంచెం ఫన్నీగా ఉంటుంది. 

గ్లామర్ బోర్ కొట్టింది..

నేను ఇప్పటివరకు చాలా గ్లామర్ రోల్స్ లో నటించాను. అలాంటి పాత్రల్లోనే నటిస్తే బోర్ కొడుతుంది. అందుకే డిఫరెంట్ రోల్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ సినిమాలో గ్లామర్ గా కనిపించనని కాదు. కొంచెం గ్లామరస్ గానే ఉంటాను. కాని రష్మి గ్లామర్ గా కనిపిస్తుంది.

ఐటెం గర్ల్ అనిపించుకోవాలని లేదు..

'టింగో టింగో' సాంగ్ తరువాత నాకు ఐటెం గర్ల్ గా నటించమని మూడు, నాలుగు ఆఫర్స్ వచ్చాయి. కాని నటించనని చెప్పాను. ఐటెం గర్ల్ గా పేరు తెచ్చుకోవాలని లేదు. అలా అని ఐటెం సాంగ్స్ లో నటించనని చెప్పను. మంచి బ్యానర్, మంచి సినిమా అయితే నటిస్తాను.

చాలా హ్యాపీగా ఉన్నాను..

కెరీర్ పరంగా చాలా సంతోషంగా ఉన్నాను. హిందీలో గ్రేట్ గ్రాండ్ మస్తీ, కన్నడలో మరో సినిమా, బెంగాలీలో ఒక సినిమాలో, తెలుగులో నటిస్తున్నాను. డిఫరెంట్ లాంగ్వేజెస్ లో, డిఫరెంట్ రోల్స్ లో నటిస్తున్నాను. మంచి దర్శకులతో పని చేస్తున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement