Advertisement

ప్రభాస్ తో సినిమా చేస్తా: దసరథ్

Sun 28th Feb 2016 09:29 PM
dasarath interview,shourya movie,manchu manoj  ప్రభాస్ తో సినిమా చేస్తా: దసరథ్
ప్రభాస్ తో సినిమా చేస్తా: దసరథ్
Advertisement

'సంతోషం' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకు పరిచయమయిన దర్శకుడు దసరథ్. 'సంబరం','మిస్టర్ పెర్ఫెక్ట్' వంటి చిత్రాలతో ఫ్యామిలీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహించిన 'శౌర్య' మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా..

థ్రిల్లింగ్ లవ్ స్టోరీ..

శౌర్య సినిమా ఒక థ్రిల్లింగ్ లవ్ స్టోరీ. డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. 'శ్రీ' సినిమా చేసిన దగ్గర నుండి ప్రయత్నిస్తున్నాను. ఇప్పటికి కుదిరింది. సాధారణంగా ప్రేమకథలు అంటే ఇంట్లో తల్లి తండ్రులు ఒప్పుకోకపోవడం వలనో, లేక ఒకరి మధ్య ఒకరికి విభేదాలు వచ్చి విడిపోవడం వలనో ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఈ సినిమా దానికి మించి ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో ఏం జరగబోతుందో ఎవరు ఊహించని విధంగా సినిమా ఉంటుంది.

మనోజ్ బాగా చేశాడు..

ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కు రెండు డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. నెగెటివ్ పాత్ర లేక పాజిటివ్ క్యారెక్టర్ అనేది అర్ధం కాకుండా ఉంటుంది. మనోజ్ ఇది వరకు భిన్నమైన పాత్రల్లో నటించాడు. దాని వలన ఈ సినిమాకు ఆయన నటన ప్లస్ అయింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కథ మొదలయ్యి విలేజ్ లోనే పూర్తవుతుంది. ఈ సినిమాలో మనోజ్ బాగా చదువుకొని, ఉద్యోగం చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో కనిపిస్తాడు. 'శ్రీ' తరువాత దాదాపు పది సంవత్సరాల మనోజ్ తో సినిమా చేశాను. అప్పటికి ఇప్పటికి తనలో ఎలాంటి మార్పు లేదు. అదే ఎనర్జీ, అదే తపన ఉంది. 

ఇద్దరి జీవితాలకు సంబంధించిన కథ..

ప్రేమ అనేది ఎవడికి వాడికి సెపరేట్ క్వచ్చన్ పేపర్. నీ ఆన్సర్ నాకు పనికి రాదు.. నా ఆన్సర్ నీకు పనికి రాదు. అదే కాన్సెప్ట్ తో సినిమా చేశాం. 11 నెలల్లో ఇద్దరి జీవితాల్లో ఏం జరిగిందో అదే ఈ సినిమా. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలంటే తప్పు కాదు. కాని మా సినిమా మాత్రం అలా ఉండదు. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ స్టొరీ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. కాని సినిమా చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది.

కథే హైలైట్..

సినిమాలో కథే పెద్ద హైలైట్. తెలుగులో ఇలాంటి సినిమా రాలేదు. హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. ప్రకాష్ రాజ్ పాత్ర కొత్తగా ఉంటుంది. సినిమాలో ఎలాంటి ఫైట్స్ ఉండవు.

చిన్న బడ్జెట్ లో చేయాలనుకున్నా..

ఈ సినిమాను తక్కువ బడ్జెట్ లో 45 రోజుల్లో పూర్తి చేయాలనుకున్నాను. అప్పుడు తమ్ముడు నాతోనే ఉన్నాడు. చిన్న సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తూ.. సీరియల్స్ కు కూడా వర్క్ చేసేవాడు. ఈ సినిమాకు నాకున్న అవకాసంలో నా తమ్ముడు వేదా నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాను. కాన్సెప్ట్ బావుందని పెద్దగానే సినిమా చేద్దామని శివకుమార్ గారు ప్రోత్సహించారు. అయినా 51 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసేసాను. 

ఇండస్ట్రీలో నాకు గౌరవం ఉంది..

నా కెరీర్ లో హిట్స్ చూశాను.. ఫ్లాప్స్ చూశాను. నన్ను ఎప్పుడూ ఇండస్ట్రీ ఒకలానే చూసింది. బేసిక్ గా నేను చాలా సింపుల్ గా ఉంటాను. సక్సెస్ ను, ఫెయిల్యూర్ ను ఒకేలా ట్రీట్ చేస్తాను. ఇప్పటికి నేను కథలు చెప్తే వినని హీరో ఉండడు. చిన్న హీరోల నుండి స్టార్ హీరోల వరకు అందరికి కథలు చెప్పగలను. ఇప్పటివరకు నా కెరీర్ లో సంతోషంగానే ఉన్నాను. మంచి సినిమా తీస్తే.. హిట్ చేస్తారు. లేదంటే ఫ్లాప్ ఇస్తారు. అప్పుడు ఇంకా బెటర్ గా తీయడానికి ప్రయత్నిస్తాను.

రొటీన్ అంటేనే రిస్క్..

ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. రొటీన్ గా సినిమాలు చేస్తేనే.. ఇప్పుడు రిస్క్ అనిపిస్తుంది. అయినా కంటెంట్ బావుంటే ప్రేక్షకులు హిట్ చేస్తారు.

రీషూట్స్ చేస్తాను..

నేను రైటర్ గా ఉన్నప్పుడు కనీసం ఇరవై మందికి కథ వినిపించేవాడిని. వారు చెప్పిన సజెషన్స్ తీసుకొని సినిమా మొదలుపెడతాను. సినిమా ఎనభై శాతం షూటింగ్ పూర్తయిన తరువాత మళ్ళీ సినిమా చూపిస్తాను. అప్పటికి కూడా ఏమైనా తప్పులు ఉన్నాయని చెబితే రీషూట్స్ కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాను. 

వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్..

ఇండస్ట్రీలో వినాయక్, కోన వెంకట్, గోపి మోహన్, ఆర్.పి.పట్నాయక్ నాకు మంచి స్నేహితులు. హీరోల్లో మనోజ్, ప్రభాస్ మంచి ఫ్రెండ్స్. సినిమాలకు సంబంధం లేకుండా మేము రెగ్యులర్ గా కలుస్తుంటాం. 

ప్రభాస్ తో సినిమా చేస్తా..

ప్రభాస్ తో ఖచ్చితంగా సినిమా చేస్తాను. త్వరలోనే ఆ విషయాలను వెల్లడిస్తాను.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

ప్రస్తుతానికి ఇంకా ఏది ఫైనల్ చేయలేదు. ఈ సినిమా రిజల్ట్ తరువాత ఆలోచిస్తాను. కథలు అయితే చాలానే రాసుకున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement