Advertisement

సినీజోష్ ఇంటర్వ్యూ-ఆదాశర్మ

Tue 23rd Feb 2016 12:57 AM
adah sharma interview,ravikanth perepu,kshanam movie  సినీజోష్ ఇంటర్వ్యూ-ఆదాశర్మ
సినీజోష్ ఇంటర్వ్యూ-ఆదాశర్మ
Advertisement

అడవిశేష్, ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా రవికాంత్ పేరెపు దర్శకత్వంలో పి.వి.పి బ్యానర్ లో నిర్మిస్తోన్న చిత్రం 'క్షణం'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఆదాశర్మతో సినీజోష్ ఇంటర్వ్యూ..

ఛాలెంజింగ్ రోల్..

నా మొదటి సినిమా 1920 లో నటించిన తరువాత అంత ఛాలెంజింగ్ రోల్ 'క్షణం' లో చేశాను. ఇప్పటివరకు నేను నటించిన సినిమాల్లో ఏం జరగబోతోందో..? ఇమాజిన్ చేసుకోవచ్చు కాని ఈ సినిమాలో అలా ఉండదు. థ్రిల్లింగ్ గా, ఊహించని విధంగా సినిమా నడుస్తుంటుంది. నా పాత్ర పేరు శ్వేత. సినిమాలో నాకొక కూతురు కూడా ఉంటుంది. 

ఎలాంటి రిసెర్చ్ చేయలేదు..

ఈ సినిమాలో మొదటిసారిగా తల్లి పాత్రలో కనిపించబోతున్నాను. అలా నటించడానికి నేను ఎలాంటి రిసెర్చ్ చేయలేదు. నాకు రవి ఈ సినిమా కథ చెప్పినప్పుడు 'నీ నటనతో ఆడియన్స్ ను ఎంగేజ్ చేయాలి' అని చెప్పాడు. ఈ సినిమాలో రెండు కథలు రన్ అవుతుంటాయి. ఒక గతానికి సంబంధించినది.. రెండు ప్రస్తుతానికి సంబంధించినది. కాలేజ్ అమ్మాయిలా, ఒక తల్లిగా రెండు రకాలుగా కనిపించడానికి మాత్రం లుక్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాం.

సర్ప్రైజ్ అయ్యాను..

శేష్ ఈ సినిమా కథ రాశాడు. మొదట శేష్, రవి నన్ను అప్రోచ్ అయ్యి కథ చెప్పినప్పుడు సర్ప్రైజ్ అయ్యాను. ఒక డిఫరెంట్ రోల్ లో నన్ను నమ్మి నటించమని అడిగినప్పుడు థ్రిల్లింగ్ గా అనిపించింది. నిజజీవితంలో ఎలా ఉంటామో.. అలానే ఉండేలా సినిమా తీశారు. ఈ సినిమాలో నాలో యాక్టింగ్ స్కిల్స్ పెరిగాయి.

సినిమా ఒప్పుకోవడానికి అదొక కారణం..

పి.వి.పి గారు ఈ సినిమా వెనుక ఉండి అన్ని చూసుకుంటున్నారు. నేను సినిమా ఒప్పుకోవడానికి అదొక కారణం. ప్రయోగాత్మక చిత్రాలను పివిపి సంస్థ వారు బాగా సపోర్ట్ చేస్తున్నారు.

తనకు అటెంన్షన్ రాకపోతే బాధపడేదాన్ని..

ఈ సినిమాలో నాతో పాటు అనసూయ కూడా నటించింది. తనను చూసి నేను ఈర్ష్య పడట్లేదు. నటిగా తనలో మంచి టాలెంట్ ఉంది. తనకు అటెంన్షన్ రాకపోతేనే నేను బాధ పడేదాన్ని. వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ప్రతి సింగిల్ క్యారెక్టర్ కి ప్రాముఖ్యత ఉంటుంది. అనసూయకు, నాకు కాంబినేషన్ సీన్స్ లేవు. 

ఇది మూడోసారి జరగడం..

నేను నటించిన సినిమాలు వారం రోజుల గ్యాప్ లో రిలీజ్ అవ్వడం ఇది మూడోసారి. మొదట 'హార్ట్ ఎటాక్' ,'హసీతో ఫసీ' తరువాత 'సన్నాఫ్ సత్యమూర్తి','రానా విక్రమ' విషయంలో అలానే జరిగింది. ఇప్పుడు 'గరం','క్షణం' సినిమాలు వారం రోజుల గ్యాప్ లో రిలీజ్ అవుతున్నాయి. కాని గరం సినిమాకు ఈ సినిమాకు చాలా తేడా ఉంది. అది కమర్షియల్ ఫిలిం అయితే ఇదొక థ్రిల్లర్ మూవీ. కంప్లీట్ గా రెండు విభిన్న చిత్రాలివి.

వైజాగ్ బీచ్ బాగా నచ్చింది..

ఈ సినిమాలో నేను ఎక్కువగా ఏడుస్తూ ఉంటాను. ఏడ్చి ఏడ్చి నా కళ్ళు పొంగిపోయేవి. మంట కూడా పుట్టేది. కాని ఆ పాత్రలో నటించిన తరువాత చాలా తృప్తిగా అనిపించింది. అలానే సినిమా షూటింగ్ కోసం వైజాగ్ వెళ్లాం. అక్కడ బీచ్ లో చాలా ఎంజాయ్ చేశాను. నాకు బాగా నచ్చింది. 

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

ఏదైనా సినిమా మొదలయిన తరువాతే నేను చెప్తాను. అది నా సెంటిమెంట్. హిందీలో, తెలుగులో అయితే డిస్కషన్స్ జరుగుతున్నాయి అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement