Advertisement

సినీజోష్ ఇంటర్వ్యూ-నిక్కీ గల్రాని

Tue 16th Feb 2016 01:47 PM
nikki galrani interview,krishnashtami movie,sunil,vasu varma  సినీజోష్ ఇంటర్వ్యూ-నిక్కీ గల్రాని
సినీజోష్ ఇంటర్వ్యూ-నిక్కీ గల్రాని
Advertisement

సునీల్, నిక్కీగల్రాని, డింపుల్ చొపాడే ప్రధాన పాత్రల్లో వాసువర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తోన్న చిత్రం 'కృష్ణాష్టమి'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 19న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరోయిన్ నిక్కీ గల్రాని విలేకర్లతో ముచ్చటించారు.

నేపధ్యం..

ఇంట్లో వారికి నేను డాక్టర్ అవ్వాలని కల. నేను కూడా సైన్స్ లో జాయిన్ అయ్యి కొన్ని రోజులు చదివాను. కాని మధ్యలోనే వదిలేసి ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేశాను. కాలేజీ టైంలోనే సినిమాల్లో నటించమని చాలా ఆఫర్స్ వచ్చాయి. కాని ఎందుకో ఒప్పుకోలేదు. కోర్సు కంప్లీట్ చేసి మోడలింగ్ చేయడం మొదలు పెట్టాను. 10 నెలల్లో 45 యాడ్స్ లో నటించాను. 1983 అనే మలయాళం సినిమా ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టాను. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల్లో 15 సినిమాల్లో నటించాను. 'కృష్ణాష్టమి' సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్నాను.

మొదట సినిమాలో నటించలేననుకున్నా..

కేరళలో ఓ సినిమా షూటింగ్ చేస్తోన్న సమయంలో దిల్ రాజు గారి ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది. వాళ్ళు చెప్పిన డేట్స్ కి నేను వేరే మలయాళం సినిమా కమిట్ అయ్యాను. మలయాళంలో ఒక సినిమా చేస్తున్నప్పుడు మరో సినిమాలో నటించకూడదనే రూల్స్ ఉన్నాయి. సో.. ఇంక 'కృష్ణాష్టమి' సినిమాలో నటించలేననుకున్నాను. రెండుమూడు రోజుల తరువాత దిల్ రాజు గారి ఫోన్ చేసి ప్రీప్రొడక్షన్ పనులు మొదలుపెట్టిన నెల తరువాత సినిమా చిత్రీకరణ మొదలవుతుందని చెప్పారు. వెంటనే సినిమా ఒప్పుకున్నాను. 

'పల్లవిజం' ఉంటుంది..

ఈ సినిమాలో ఓ ఎన్నారై అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. నా క్యారెక్టర్ పేరు పల్లవి. బేసిక్ గా తను మంచి రైటర్. 'పల్లవిజం' అనే ఓ బుక్ రాస్తుంటుంది. క్యూట్ గా ఇన్నోసెంట్ గా ఉండే తను 'పల్లవిజం' లో రాసే లాజిక్స్ కు ఇంటెన్స్ మీనింగ్ ఉంటుంది.  ఆ బుక్ ను పబ్లిష్ చేయాలనుకుంటుంది. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుందని ఆలోచించే వ్యక్తి. ఏ సమస్యనైనా పాజిటివ్ గా తీసుకొని సాల్వ్ చేసుకుంటుంది. 

'కృష్ణాష్టమి' రోజే అంతా..

సినిమాలో హీరో పేరు కృష్ణ వరప్రసాద్. తను పుట్టింది కృష్ణాష్టమి రోజు. కృష్ణాష్టమి రోజునే తన లైఫ్ లో పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఘటనతో తన జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. మళ్ళీ అదే సమస్యను 'కృష్ణాష్టమి' రోజే పరిష్కరిస్తాడు. అందుకే సినిమా టైటిల్ 'కృష్ణాష్టమి' అని పెట్టాం.

సునీల్ డెడికేటెడ్ పెర్సన్..

సునీల్ గారితో వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది. స్వీట్ అండ్ హంబుల్ పెర్సన్. ఆయన దగ్గర నుండి చాలా నేర్చుకున్నాను. వర్క్ పట్ల డెడికేషన్ ఉన్న మనిషి. ఫారెన్ లో రెండు డిగ్రీల టెంపరేచర్ లో ఉదయాన్నే నాలుగింటికి లేచి జాగింగ్ కి వెళ్లి వచ్చేవారు.

టిపికల్ హీరోయిన్ గా ఉండడం నచ్చదు..

పాటలకు, కొన్ని సీన్లకు మాత్రమే హీరోయిన్ గా నటించడం నాకు నచ్చదు. నా పాత్రకు వెయిట్ ఉండాలి. పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉండాలి. గ్లామర్ డాల్ లా ఉండడం నాకు నచ్చదు. అందుకే నా పాత్రలో ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. నేను చేసే క్యారెక్టర్స్ లో ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి. 

వాసు గారు సహనంగా ఉంటారు..

నేనే చాలా సహనంగా ఉంటానని ఫీల్ అవుతాను. వాసు గారైతే ఇంక చెప్పకర్లేదు. ఎలాంటి పరిస్థితినైనా చాలా కూల్ గా హ్యాండిల్ చేస్తారు. ఎనభై శాతం సినిమా షూటింగ్ ఫారెన్ లోనే చేశాం. ఇరవై శాతం మాత్రం హైదరాబాద్ లో షూట్ చేశాం. 

తెలుగు సినిమాల్లో కమెర్షియాలిటీ ఉంటుంది..

నేను మలయాళం, తమిళం, కన్నడ సినిమాల్లో నటించాను. భాషను బట్టి సినిమాను క్యాటరైజ్ చేయలేను. ఏదైనా సినిమానే. ప్రొఫెషన్ ఒక్కటే. కాని మలయాళం సినిమాలు జీవితానికి దగ్గరగా ఉంటాయి. తమిళంలో రియాల్టీకి దగ్గరగా ఉంటూ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తారు. తెలుగు సినిమాల్లో మాత్రం కమెర్షియాలిటీ ఎక్కువ ఉంటుంది.

గ్లామర్ అంటే స్కిన్ షో కాదు..

నేను నటించే సినిమాలు కుటుంబమంతా కలిసి చూడాలి. అలా ఉండే పాత్రలే ఎన్నుకుంటాను. నా దృష్టిలో గ్లామర్ అంటే స్కిన్ షో కాదు. అమ్మాయిని చీరలో కూడా గ్లామర్ గా చూపించొచ్చు. ఈ సినిమాలో నేను స్కర్ట్స్, జీన్స్ వేసుకున్నాను. క్యూట్ గా కనిపిస్తాను కాని ఎక్కడా వల్గారిటీ ఉండదు.

నాకు అక్క, అమ్మలాగా..

సినిమా కథలు నేనే వింటాను. నాకు నచ్చిన తరువాత ఫ్యామిలీతో డిస్కస్ చేస్తాను. నాకు ఏవైనా డౌట్స్ ఉంటే అక్కను(సంజన) అడిగి క్లారిఫై చేసుకుంటాను. నాకు అక్క అంటే అమ్మలాగా. తనతో మంచి బాండింగ్ ఉంటుంది. నేను సక్సెస్ అయితే మొదట సంతోషించేది తనే. 

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

తమిళంలో మూడు సినిమాల్లో నటిస్తున్నాను. తెలుగులో కూడా ఆఫర్స్ వస్తున్నాయి. 'కృష్ణాష్టమి' రిలీజ్ అయిన తరువాత ఫైనల్ చేస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement