Advertisement

సినీజోష్ ఇంటర్వ్యూ-నిత్యాశెట్టి

Mon 15th Feb 2016 04:07 PM
nithyashetty interview,padesave movie,chunia  సినీజోష్ ఇంటర్వ్యూ-నిత్యాశెట్టి
సినీజోష్ ఇంటర్వ్యూ-నిత్యాశెట్టి
Advertisement

కార్తిక్ రాజు, నిత్యాశెట్టి, సమీరా ప్రధాన పాత్రల్లో అయాన్ క్రియేషన్స్ బ్యానర్ పై చునియా దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తోన్న చిత్రం 'పడేసావే'. ఈ సినిమా ద్వారా హీరోయిన్ నిత్యాశెట్టి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. రీసెంట్ గా ఈ సినిమా పాటలు విడుదలయ్యాయి. త్వరలోనే సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ నిత్యాశెట్టి సినిమా గురించి విలేకర్లతో ముచ్చటించారు. 

సినిమాలో పాత్ర..

ఈ సినిమాలో నీహారిక అనే పాత్రలో నటించాను. ఇదొక ట్రైయాంగల్ లవ్ స్టొరీ. ఇప్పటివరకు సినిమాలుగా చాలా ప్రేమకథలు వచ్చాయి. మాది కూడా సింపుల్ లవ్ స్టొరీ. కాని ప్రేమలో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ప్రేమ అనేది జిగ్సా పజిల్ లాంటిది. 

ఆడియో రెస్పాన్స్..

సినిమా ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. నా మొదటి సినిమాకు అనూప్ రూబెన్స్ గారు మ్యూజిక్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. మంచి ట్యూన్స్ ఇచ్చారు. ఒక్కో పాట ఒక్కో జోనర్ లో ఉంటుంది. ఆడియోలానే సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను.

చునియా గురించి..

తను డైరెక్టర్ మాత్రమే కాదు నాకు మంచి ఫ్రెండ్. ఆమెతో కలిసి వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాను. నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. వర్క్ పట్ల డెడికేషన్ ఉన్న పెర్సన్. పెర్ఫెక్షన్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వరు.

కో స్టార్స్ గురించి..

నా కో స్టార్ కార్తిక్ తో వర్క్ చేయడం చాలా హ్యాపీ. మంచి ఎంటర్టైనింగ్ పెర్సన్. సెట్స్ లో ఎంతో ఫన్ చేసేవాడు. అలానే నాతోపాటు మరో లీడ్ రోల్ లో నటించిన సమీరా నాకు మంచి ఫ్రెండ్ అయిపోయింది. ఎక్కడకి వెళ్ళినా మేమిద్దరమే ఉండేవాళ్ళం. తను కాశ్మీర్ అమ్మాయి. తెలుగు రాకపోయినా చాలా చక్కగా డైలాగ్స్ చెప్పింది.

నాగార్జున అంటే బాగా ఇష్టం..

నాకు చిన్నప్పటినుండి నాగార్జున గారంటే చాలా ఇష్టం. ఆయన ఈ సినిమాకు అసోసియేట్ అవ్వడం చాలా సంతోషంగా అనిపించింది. మంచి క్యారెక్టర్. మంచి టీం కుదిరింది.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

రాహుల్ రవీంద్రన్ హీరోగా నటిస్తోన్న 'శోభన్ బాబు'సినిమాలో హీరోయిన్ గా ఎంపికయ్యాను. ఓ తమిళ సినిమాలో నటిస్తున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement