Advertisement

సినీజోష్ ఇంటర్వ్యూ-మదన్

Sat 06th Feb 2016 06:23 PM
madan interview,garam movie,aadi,saikumar,garam releasing on february 12th  సినీజోష్ ఇంటర్వ్యూ-మదన్
సినీజోష్ ఇంటర్వ్యూ-మదన్
Advertisement

'ఆ నలుగురు' చిత్రానికి కథను అందించి 'పెళ్ళైన కొత్తలో','ప్రవరాఖ్యుడు' వంటి చిత్రాలతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వ్యక్తి మదన్. చాలా గ్యాప్ తరువాత మాస్ ఎంటర్టైనర్ 'గరం' సినిమాతో మదన్ మరోసారి తన దర్శక ప్రతిభను పరీక్షించుకోనున్నాడు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా మదన్ విలేకర్లతో ముచ్చటించారు.

అందుకే లేట్ అయింది..

ఈ సినిమాను 2014 ఆగస్ట్ లో మొదలుపెట్టాం. ఆ తరువాత హీరో ఆది పెళ్లి, కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వలన సినిమా షూటింగ్ డిలే అవుతూ వచ్చింది. నా స్నేహితుడి మరణం వలన నేను బాగా క్రుంగిపొయాను. ఆ కోమా నుండి బయటకు వచ్చి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి కాస్త సమయం పట్టింది. 

ఆ డైలాగ్ తో కథ మీద పట్టు వచ్చింది..

శ్రీనివాస్ గవిరెడ్డి నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసేవాడు. 2012 లో ఈ సినిమా లైన్ చెప్పాడు. అప్పటి నుండి కథను డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఇదొక ట్రీట్మెంట్ బేస్డ్ ఫిలిం. స్క్రీన్ ప్లే సినిమాకు ఆయువు పట్టు. హీరో పాత్ర మీద మాత్రం నాకు గ్రిప్ దొరికేది కాదు. దొరికితేనే కాని కథ మీద పట్టు రాదు. సినిమా షూటింగ్ కి వెళ్ళే ముందు 'సచ్చేదాకా సవాలక్ష ప్రాబ్లమ్స్ ఉంటాయి.. అలా అని తినడం మానేస్తామా..? తొంగోడం మానేస్తామా..? అలానే ప్రేమించడం కూడా మానలేం..' అనే డైలాగ్ రాసుకున్నాను. దాంతో హీరో పాత్ర ఎలా ఉండాలో నాకొక ఐడియా వచ్చింది. అప్పుడు ప్రాజెక్ట్ మీద కాన్ఫిడెన్స్ పెరిగింది.

అందుకే 'గరం' అనే టైటిల్ పెట్టాం..

గరం అంటే కోపం అని అర్ధం. ఇదొక మంచి రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఓ కుటుంబం లో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. దాని వలన ఒక రకమైన సీరియస్ నెస్ క్రియేట్ అవుతుంది. కమర్షియల్ గా కూడా టైటిల్ అందరికి బాగా రీచ్ అవుతుందని 'గరం' అని పెట్టాం.

ఆది నమ్మకమే ఈ 'గరం'..

'గరం' సినిమా పూర్తి కావడానికి కారణం ఆదినే.. సినిమా తప్ప తనకు వేరే ప్రపంచం తెలియదు. ఎంతో హార్డ్ వర్క్ చేస్తాడు. వర్క్ పట్ల డెడికేషన్ ఉన్న మనిషి. తన నమ్మకమే ఈ 'గరం'. ఈ సినిమా మీద ఆదికి ఉన్న నమ్మకం మాలో ఉన్న బద్దకాన్ని పోగొట్టింది. తన పాత్రను బాగా క్యారీ చేశాడు. ఎంతో కేర్ తీసుకున్నాడు. పుట్టిన దగ్గర నుండి చచ్చేదాకా మన చుట్టూ ఉండేవారిని ప్రేమించాల్సిందే.. అదే ఆది పాత్రలో రిఫ్లెక్ట్ అవుతుంటుంది. కొత్త యాంగల్ లో కనిపిస్తాడు.

ప్రేక్షకులు నిరాశ చెందరు..

ఇప్పటివరకు నేను చేసిన చిత్రాల్లో ఒక రకమైన రిలేషన్ తో సినిమా నడుస్తుంటుంది. ఈ సినిమాలో కూడా ఆ రిలేషన్షిప్ మిస్ అవ్వదు. మదన్ సినిమా అని సినిమాకొచ్చే ప్రేక్షకుడు మాత్రం డిసప్పాయింట్ అవ్వడు. 

కీరవాణి గారితో కుదరలేదు..

నా సినిమాలకు కీరవాణి గారితో మ్యూజిక్ చేయిస్తుంటాను. ఈ సినిమాకు మాత్రం కుదరలేదు. ఎక్కువ రోజులు షూటింగ్ చేశాం కాబట్టి కీరవాణితో మాకు డేట్స్ దొరకలేదు. అగస్త్య నా స్నేహితుడు. పెళ్ళైన కొత్తలో సినిమాకు నాతో కలిసి పని చేశాడు. మరోసారి ఈ సినిమా ద్వారా తనతో కలిసి పని చేసే అవకాసం లభించింది. సూపర్బ్ ట్యూన్స్ ఇచ్చాడు. 

ఇండస్ట్రీ వొదిలి వెళ్ళిపోదాం అనుకున్నా..

2009 లో ప్రవరాఖ్యుడు సినిమా రిలీజ్ అయిన తరువాత సొంత వ్యాపారం మొదలుపెట్టాను. అది కలిసి రాలేదు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీ వొదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఎవరైనా పని చేసిన వెంటనే రిజల్ట్ కోరుకుంటారు. ప్రవరాఖ్యుడు సినిమా రిలీజ్ అయిన మరుసటి రోజు నుండి తెలంగాణా ఉద్యమాలు మొదలయ్యాయి. థియేటర్లు అన్ని మూసేశారు. ఆంధ్ర మాత్రం సినిమాకు హిట్ టాక్ వచ్చింది. అక్కడ కూడా రెండు వారాలు నలిగి 50 రోజులు ఆడింది. యూట్యూబ్ లో కూడా ఆ సినిమాను చాలా మంది చూశారు. 2009 లో చేసిన ఆ సినిమాకు 2014 లో మంచి రిజల్ట్ వచ్చింది. 

బెస్ట్ ప్రొడక్షన్..

సాయి కుమార్ లాంటి మరో నిర్మాతను చూడలేనేమో.. నేనేం అడిగితే అది ప్రొవైడ్ చేసేవారు. ఒక దర్శకునిగా నాకు ఎంతో ఫ్రీడం ఇచ్చారు. ఎలాంటి నిబంధనలు పెట్టలేదు.

కంటెంట్ ఉన్న సినిమా ఎప్పుడు హిట్టే..

సోల్ ఉన్న సినిమాను కమర్షియల్ గా చూపించగలం కాని కంటెంట్ ఉన్న సినిమాను కమర్షియల్ గా చూపించలేం. కొన్ని సినిమాలకు మాత్రమే అలా చూపించే స్కోప్ ఉంటుంది. కంటెంట్ ఉన్న సినిమాకు ఎప్పుడూ గుర్తింపు లభిస్తుంది. సమకాలీన పరిస్థితులను ఆధారంగా చేసుకొని సినిమా తీస్తే ఖచ్చితంగా హిట్ అవుతుంది. 

గుర్తించలేదంటే మన తప్పే..

మొదట్లో నాకు మంచి గుర్తింపు రావట్లేదని బాధ పడేవాడిని. కాని తరువాత నుండి మానేశాను. మనం హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా గుర్తిస్తారు. గుర్తించలేదంటే మనం ఎఫర్ట్ పెట్టలేనట్లే.. 

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

ఇప్పటివరకు ఏది ఫైనల్ చేయలేదు. ఈ సినిమా రిజల్ట్ మీద నా తదుపరి చిత్రం ఆధారపడి ఉంటుంది అంటూ ఇంటర్వ్యూ ముగించారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement