Advertisement

సినీజోష్ ఇంటర్వ్యూ- కింగ్ నాగార్జున

Thu 14th Jan 2016 05:43 PM
nagarjuna ionterview,soggade chinni nayana,kalyan krishna  సినీజోష్ ఇంటర్వ్యూ- కింగ్ నాగార్జున
సినీజోష్ ఇంటర్వ్యూ- కింగ్ నాగార్జున
Advertisement

సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు రిలీజ్ అవుతాయని నేను అసలు ఊహించలేదు. మా చిత్రాన్ని సంక్రాంతికే రిలీజ్ చేయాలని భావించి నవంబర్ లోనే థియేటర్లు బుక్ చేసుకున్నాం అంటున్నాడు కింగ్ నాగార్జున. ఆయన నటించిన 'సోగ్గాడే చిన్ని నాయన' గురించి మరిన్ని విశేషాలు నాగ్ మాట్లల్లో..

ముందు తాత, మనువడు అనుకున్నాం..

ఈ సినిమాలో డ్యుయల్ రోల్ లో నటించాను. బంగార్రాజు, రాము అనే తండ్రి,కొడుకు పాత్రల్లో కనిపిస్తాను. మొదట తండ్రి కొడుకుల్లా కాకుండా తాత, మనువడిగా అనుకున్నారు. కాని మేకప్ విషయంలో, ఆర్టిస్టుల విషయంలో సమస్యలు వస్తాయని తండ్రి కొడుకుల్లా చేయాలని ఫైనల్ చేశాం. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండాలని కూడా మొదట అనుకోలేదు. పల్లెటూరి వాతావరణంలో సినిమా చేసి చాలా రోజులయ్యిందని, కొత్తగా ఫ్రెష్ గా ఉంటుందని విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చేశాం.

'సోగ్గాడు'లా తిరుగుతాడు..

సినిమాలో బంగార్రాజు ఒక జమిందార్. సోగ్గడులా బుల్లెట్ మీద తిరుగుతూ ఉంటాడు. అమ్మాయిలు కనిపిస్తే వాళ్ళతో మాట్లాడుకుండా ఉండడు. టైటిల్ కూడా అందుకే పెట్టాం. ఇక తన కొడుకు రాము ఎన్నారై. పని తప్ప మరొకటి తెలియదు. లోకజ్ఞానం లేని మనిషి. 

అందుకే డిలే అయింది..

'మనం' సినిమా తరువాత ఒక నెల ఎంజాయ్ చేశాం. ఆ తరువాత 'ఊపిరి' సినిమా సైన్ చేశాను. కాని ఊపిరి సినిమా షూటింగ్ మొదలవ్వడానికి కాస్త సమయం దొరకడంతో 'సోగ్గాడే చిన్ని నాయనా' షూటింగ్ మొదలు పెట్టాం. మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ కూడా అప్పుడే మొదలుపెట్టారు. మార్చి, ఏప్రిల్ నాటికి 'ఊపిరి' షూటింగ్ మొదలయ్యింది. సో.. మూడు ఒకే సమయంలో చేయడంతో సినిమా రిలీజ్ కొంచెం డిలే అయింది. సెప్టెంబర్ నెలలోనే రిలీజ్ చేయాలనుకున్నాం. కాని 'అఖిల్' సినిమా రిలీజ్ ఉండడంతో పండగకు వస్తే బావుంటుందని సంక్రాంతి ప్లాన్ చేసుకున్నాం.

కొత్తవాళ్ళతో చేయడం ఇష్టం..

కొత్త దర్శకులతో పని చేయడమంటే నాకు చాలా ఇష్టం. కొత్త వాళ్లకు ఎప్పుడు అవకాశాలు ఇస్తూనే ఉంటాను. రామ్మోహన్ గారు చెప్పిన లైన్ ను కళ్యాన్ కృష్ణ డెవలప్ చేశారు. తను మంచి రైటర్. డైలాగ్స్ అన్ని చాలా బాగా రాశాడు. టీం తో కలిసి వర్క్ చేస్తాడు. తనలో నాకు ఆ విషయం బాగా నచ్చింది. ఫీలింగ్స్ ను చాలా బాగా కన్వెయ్ చేయగలడు. తెలుగు నేటివిటీ పట్ల మంచి కమాండ్ ఉంది. 

రెండు సినిమాలు ఖచ్చితంగా చూస్తారు..

పండగా సీజన్ లో మూడు, నాలుగు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వడం కొత్తగా ఏమి జరగట్లేదు. రామారావు గారు, నాన్నగారు హీరోలుగా ఉన్నప్పటి నుండి పండగకు మూడు, నాలుగు సినిమాలు రిలీజ్ అవుతూనే ఉండేవి. అయితే ప్రేక్షకులు మాత్రం అన్ని సినిమాలు చూడలేకపోయినా ఖచ్చితంగా రెండు మంచి చిత్రాలను అయితే చూస్తారు. 

'అఖిల్' సినిమాతో డిసప్పాయింట్ అయ్యా..

'అఖిల్' సినిమా రిజల్ట్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను. వారం రోజులు బయటకి రాలేకపోయాను. షాకింగ్ గా అనిపించింది. వినాయక్ హార్డ్ వర్క్ చేసి తీశాడు. ఆయనకు తెలిసిన పద్ధతిలో చక్కగా తీశారు. కాని ఎందుకో ఆ సినిమా ప్రేక్షకులకు రీచ్ అవ్వలేదు. నా కొడుకు సినిమా బాగా ఆడలేదని మాత్రమే నేను బాధపడ్డాను. ఇప్పుడు అఖిల్ సినిమాలు చేయాలనే తొందరలో లేడు. జాగ్రత్తగా ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఒకానొక సమయంలో నేను కూడా అలాంటి సమస్యను ఫేస్ చేశాను. 'గీతాంజలి' ముందు వరకు చెప్పుకోదగ్గ హిట్టు సినిమా పడలేదు. మణిరత్నం గారి 'మౌనరాగం' సినిమా చూసి ఆయన చుట్టూ తిరిగి నా సెన్సిబిలిటీస్ ప్రకారం గీతాంజలి సినిమా చేశాను. అఖిల్ కు కూడా నీ సెన్సిబిలిటీస్ బట్టి సినిమాలు చెయ్యమని చెబుతున్నాను.

బంగార్రాజు ఆత్మ భయపెట్టదు..

బంగార్రాజు ఆత్మ భయపెట్టే ఆత్మ కాదు.. తన భార్యకు మాత్రమే ఆత్మ కనిపిస్తుంది. 

రాఘవేంద్ర గారి కాన్సెప్ట్ నచ్చింది..

వెంకటేశ్వర స్వామీ మీద రాఘవేంద్రరావు గారు ఒక కాన్సెప్ట్ చెప్పారు. నాకు బాగా నచ్చింది. 'ఊపిరి' సినిమా కూడా రిలీజ్ అయిన తరువాత ఈ కాన్సెప్ట్ గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాం.

'ఊపిరి' షూటింగ్ అయిపోయింది..

ఊపిరి ఫుల్ కామెడీ మూవీ. 'ఇన్ టచబుల్స్' అనే ఫ్రెంచ్ సినిమా రీమేక్ అది. తెలుగు నేటివిటీకు తగ్గట్లుగా తీశాం. షూటింగ్ మొత్తం వీల్ చైర్ లోనే కూర్చోవడం చాలా ఇబ్బంది పడ్డాను. ఇంకా ఐదు రోజుల షూటింగ్ మిగిలి ఉంది. తెలుగు, తమిళంలో మంచి డేట్ చూసుకొని రిలీజ్ చేస్తాం.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్..

అనూప్ అధ్బుతమైన సంగీతాన్ని అందించారు. నాలుగు పాటలు చాలా బాగా వచ్చాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలుస్తుంది.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

ఇంకా ఏది ఫైనల్ చేయలేదు. ఊపిరి రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నాం అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement