Advertisement

సినీజోష్ ఇంటర్వ్యూ-రత్నవేలు!

Thu 19th Nov 2015 07:30 PM
rathnavelu interview,kumari 21f,hebah patel,raj tarun,sukumar  సినీజోష్ ఇంటర్వ్యూ-రత్నవేలు!
సినీజోష్ ఇంటర్వ్యూ-రత్నవేలు!
Advertisement

హేబా పటేల్, రాజ్ తరుణ్ జంటగా సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో సుకుమార్ సమర్పణలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి నిర్మిస్తున్న చిత్రం 'కుమారి 21 ఎఫ్'. ప్రముఖ కెమెరామెన్ రత్నవేలు ఈ చిత్రానికి ఫోటోగ్రఫీని అందించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 20న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సినిమాకు సంబంధించిన విషయాల గురించి విలేకర్లతో ముచ్చటించారు.

సుక్కు కోసమే చేశా..

'రోబో' సినిమా తరువాత సుమారుగా పది నుండి పదిహేను సినిమాలు ఆఫర్స్ వచ్చాయి. కాని స్క్రిప్ట్ బాగా నచ్చడంతో తమిళంలో మూడు, నాలుగు కోట్ల బడ్జెట్ గల 'హరిదాస్' సినిమాకు పని చేశాను. నాకు కథ నచ్చితేనే సినిమా చేయడానికి అంగీకరిస్తాను అంతే కాని చిన్న సినిమా, పెద్ద సినిమా అని ఆలోచించను. ప్రత్యేకంగా 'కుమారి 21 ఎఫ్' చేయడానికి మాత్రం కారణం సుకుమారే. తనకు ఈ సినిమా చేయడం నా బాధ్యతగా భావించాను. ఇది చిన్న సినిమా అయినా.. ప్రొడక్షన్ వాల్యూస్ భారీగా ఉంటాయి. మంచి ఇంటెలిజెంట్ స్క్రిప్ట్. సుక్కు బాగా రాశాడు. కెమెరా వర్క్ కూడా చాలా రిచ్ గా ఉంటుంది.

హీరోయిన్ పాత్ర ముఖ్యమైనది..

ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తనను ఫోకస్ చేయడానికి లైట్ ఎక్కువగా ఉపయోగించాం. నాకు ఎక్కువగా సాంగ్స్ కంటే సీన్స్ షూట్ చేయడమంటేనే ఇష్టం. హీరోయిన్  లుక్ మీద ప్రత్యేకంగా చాలా శ్రద్ధ పెట్టి చిత్రీకరించాం. 

స్క్రిప్ట్ ను బాగా చదువుతా..

నేను దర్శకుల కెమెరామెన్ ని. వారు చెప్పే స్క్రిప్ట్ ను చక్కగా ప్రేక్షకులకు అర్ధమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత కెమెరామెన్ కు ఉంటుంది. అందుకే కథను కనీసం నాలుగైదు సార్లు చదువుతాను. కెమెరామెన్ అనేవాడికి సినిమా ఎడిటింగ్ లో, మ్యూజిక్ లో, డైరెక్షన్ లో నాలెడ్జ్ ఉండాలి. నాకు సుకుమార్ కు మధ్య మంచి రిలేషన్ ఉంది. తను చెప్పిన కథను ప్రెజంట్ చేయగలననే నమ్మకంతో చేశాను.

ఆ లొకేషన్ లో వద్దని చెప్పాను..

ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టినప్పుడు రద్దీగా ఎక్కువగా జనాలు ఉండే ప్రాంతంలో షూట్ చేయమని చెప్పారు. కాని నాకు స్క్రిప్ట్ విన్నప్పుడు సింపుల్ గా గ్రీనరీతో ఉండే ఒక కాలనీలో చిత్రాకరిద్దామని చెప్పాను. ఆ ఒక్క విషయంలో మాత్రమే నేను కథలో మార్పు చేశాను.

ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటూ ఉండాలి..

కేవలం రెండు లైట్స్ మాత్రమే ఉపయోగించి క్వాలిటీతో సినిమా చేయగలను. ప్రస్తుతం వస్తున్న టెక్నాలజీను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటూ ఉండాలి. టెక్నాలజీ కంటే ఆర్ట్, సైన్స్ ముఖ్యం. అలానే కెమెరామెన్ యొక్క ఆలోచనా విధానం చాలా ముఖ్యం.

తనలో టాలెంట్ ఉంది..

రాజ్ తరుణ్ లో మంచి టాలెంట్ ఉంది. చాలా బాగా పెర్ఫార్మ్ చేసాడు. తనకొచ్చిన డిఫరెంట్ స్లాంగ్ తో అందరినీ ఆకట్టుకుంటాడు. రాజ్ తరుణ్, హేబా కొత్తగా వస్తున్న ఆర్టిస్టులు. సో.. వాళ్ళని కెమెరా ఉందన్న సంగతి మర్చిపోయి నటించమని చెప్పాను. చాలా ఫ్రీడం ఇచ్చాను. 

నాకు నేనే పోటీ..

మీకు పోటీ ఎవరని అడిగితే నాకు నేనే పోటీ అని చెప్తాను. నేను చేసిన సినిమా చూసి అందరూ వచ్చి పొగుడుతున్నా.. నేను మాత్రం తృప్తి పడను. ఇంకా బాగా చేసి ఉండాల్సిందనే అనుకుంటాను. 

ఎలా చేస్తాడో చూద్దాం అనుకున్నాడు..

తమిళ సినిమాటోగ్రాఫర్ లే ఎక్కువగా ఉంటున్నారని అనుకుంటారు కాని క్రియేటివిటీ ఎవరిలో ఉంటే వాళ్ళే మంచి టెక్నీషియన్స్ అవుతారు. 'నేనొక్కడినే' సినిమా లండన్ లో షూట్ చేస్తున్నప్పుడు సెల్లార్ పార్కింగ్ లో ఒక చేజ్ ఉంటుంది. నలబై నుండి యాబై బైక్స్ ఒకేసారి స్టార్ట్ అవుతాయి. ఆ సమయంలో అక్కడ ఓ ఫేమస్ లండన్ సినిమాటోగ్రాఫర్ ఉన్నారు. లైట్స్ లేకుండా నేను సీన్ షూట్ చేయలేనేమో అనుకున్నారాయన. కేవలం రెండు, మూడు ఎల్.ఈ.డి ఫ్లాష్ లు, టార్చ్ లైట్ ఉపయోగించి నేను షూట్ చేశాను. తరువాత ఆయన మానిటర్ లో చూసి నన్ను హగ్ చేసుకొని చాలా బాగా చేసావని చెప్పారు.

డైరెక్టర్ గా చేస్తా..

ఖచ్చితంగా దర్శకునిగా ఓ సినిమా చేస్తాను. స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాను. యాక్షన్, థ్రిల్లర్ జోనర్ లో ఉంటుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందించాలనుకుంటున్నాను.

ఆ సినిమా చాలెంజింగ్ అనిపించింది..

రోబో సినిమా నా కెరీర్ లోనే మోస్ట్ చాలెంజింగ్ సినిమా అని చెప్పాలి. 150 కోట్ల బడ్జెట్ సినిమా. నా మీద చాలా ప్రెజర్ ఉండేది.

విఎఫ్ఎక్స్. మంచిదే..

విఎఫ్ఎక్స్ డెవలప్ అవ్వడం చాలా అడ్వాంటేజ్ అయింది. పని సులువుగా అవ్వడానికి ఒక కారణం అవుతుంది. పొరపాటున ఏమైనా సీన్ మిస్ చేసిన పోస్ట్ ప్రొడక్షన్ లో కవర్ చేసుకోవచ్చు.   

తనొక బ్రిలియంట్ టెక్నీషియన్..

సుకుమార్ లాంటి వ్యక్తిని ఇప్పటివరకు నేనెప్పుడు కలవలేదు. జెన్యూన్ గా ఉంటాడు. బ్రిలియంట్ టెక్నీషియన్. 'ఆర్య' సినిమా నుండి ఆయనతో ట్రావెల్ చేస్తున్నాను. నాకు, సుక్కు, దేవిల మధ్య మంచి స్నేహం ఉంది. 

'రోబో 2' నేను చెయ్యట్లేదు..

ప్రస్తుతం నేను 'బ్రహ్మొత్సవం' సినిమా చేస్తున్నాను. 'రోబో 2' సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టేసారు. నేను రెండు సినిమాలు ఒకేసారి చేయను. సినిమాల పట్ల ప్యాషనేట్ తో వర్క్ చేస్తాను. రెండు సినిమాలు ఒకేసారి ఒప్పేసుకొని క్లాష్ చేయలేను అంటూ ఇంటర్వ్యూ ముగించారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement