Advertisement

సినీజోష్ ఇంటర్వ్యూ-హేబా పటేల్!

Sun 15th Nov 2015 06:17 PM
hebha patel interview,kumari 21f,sukumar,surya prathap,raj tarun  సినీజోష్ ఇంటర్వ్యూ-హేబా పటేల్!
సినీజోష్ ఇంటర్వ్యూ-హేబా పటేల్!
Advertisement

హేబా పటేల్, రాజ్ తరుణ్ జంటగా సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో సుకుమార్ సమర్పణలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి నిర్మిస్తున్న చిత్రం 'కుమారి 21 ఎఫ్'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 20న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరోయిన్ హేబా పటేల్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

సినిమా ఎలా ఉండబోతోంది..?

ఇదొక బోల్డ్ సబ్జెక్టు. ప్రస్తుతం ఉన్న జెనరేషన్ కు తగ్గట్లుగా ఉంటుంది. మంచి లవ్ స్టొరీ. ఈ సినిమాలో కుమారి అనే టైటిల్ రోల్ నటిస్తున్నాను. ఈ సినిమా విమెన్ ఓరియెంటెడ్ ఫిలిం కాదు. హీరో,హీరోయిన్స్ ఇద్దరికీ సమాన ప్రాముఖ్యత ఉంటుంది. నేను ఈ మూవీలో మోడరన్ అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. తను అనుకున్నది చేసేస్తూ.. ఉంటుంది. వేరే వాళ్ళు ఏమనుకుంటారో.. అనే విషయాలు ఆలోచించదు. 'లివ్ అండ్ లెట్ లివ్' తరహ పాత్ర. ఈ సినిమాలో క్యారెక్టర్ కు, నా నిజజీవితానికి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. 

డైరెక్టర్ సూర్య ప్రతాప్ గారి గురించి చెప్పండి..?

ఆయనతో కలిసి వర్క్ చేయడం చాలా ఎంజాయ్ చేసాను. నన్ను బాగా ట్రైన్ చేసారు. ప్రతి విషయంలో కేర్ తీసుకొని చేశారు. 

ఈ సినిమాలో అవకాసం ఎలా వచ్చింది..?

'అలా ఎలా' సినిమాకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూలో నన్ను చూసి ఈ సినిమా ఆడిషన్ కు రమ్మని పిలిచారు. ఆడిషన్ ఇవ్వగానే సెలెక్ట్ చేసేసారు. నేను ఈ సినిమాకు ఓకే చెప్పడానికి మొదటి కారణం సుకుమార్ గారే. కథ విన్నాక బాగా నచ్చింది. 

టాప్ టెక్నీషియన్స్ తో కలిసి వర్క్ చేయడం ఎలా అనిపించింది..?

ఈ సినిమాకు సుకుమార్, దేవిశ్రీప్రసాద్, రత్నవేలు లాంటి పెద్ద పెద్ద టెక్నీషియన్స్ వర్క్ చేశారు. దేవిగారి మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రత్నవేలు గారి ఫోటోగ్రఫీ అధ్బుతంగా ఉంటుంది. నా కెరీర్ మొదట్లోనే ఇలాంటి వారితో కలిసి పని చేయడం నా అద్రుష్టంగా భావిస్తున్నాను.

రాజ్ తరుణ్ గురించి చెప్పండి..?

మొదట నాకు రాజ్ తరుణ్ గురించి తెలియదు. అతి తక్కువ సమయంలో ఎస్టాబ్లిష్డ్ హీరో అయిపోయాడు. ఒకే ఏజ్ గ్రూప్ అవ్వడం వలన తనతో వర్క్ చేయడం సులువయ్యింది. ఈజీ గోయింగ్ పర్సన్. తను నటించిన రెండు చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను.

ఈ పాత్ర కోసం ఏమైనా హోం వర్క్ చేసారా..?

సుకుమార్ గారు నా క్యారెక్టర్ డిజైన్ చేశారు. నాకంటే ఆయనే ఎక్కువ హోం వర్క్ చేశారు. డైరెక్టర్ ఎలా చెప్పారో.. అలా నటించాను. నేను డైలాగ్స్ బాగా బట్టి పట్టగలను. సో.. తెలుగు రాకపోయినా.. బట్టి కొట్టి డైలాగ్స్ చెప్పేదాన్ని.

నటి కాకపోయి ఉంటే ఏం చేసేవారు..?

నేను బొంబాయిలో గ్రేడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాతే సినిమాల్లోకి వచ్చాను. యాక్ట్రస్ కాకుంటే జర్నలిస్ట్ అయ్యేదాన్ని.

రోల్ మోడల్స్ ఎవరైనా ఉన్నారా.?

అనుష్క శెట్టి, కరీనా కపూర్, జెనీలియా అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళే నా రోల్ మోడల్స్. ముఖ్యంగా జెనిలియాను బాగా ఫాలో అవుతాను. తను తెలుగు సినిమాల్లో నటిస్తూ.. బాలీవుడ్ లో కూడా నటించేది. తనను స్పూర్తిగా తీసుకుంటాను.

తెలుగులో మీ ఫేవరెట్ హీరో..?

మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం.

ఇష్టమైన సినిమాలు..?

'హం సాత్ సాత్ హై, జబ్ వి మెట్, బొమ్మరిల్లు, బాహుబలి, ఉయ్యాలా జంపాల' సినిమాలు బాగా నచ్చుతాయి. నేను ఎక్కువగా సినిమాలు చూస్తుంటాను. కాలేజీ డేస్ లో కూడా ఎక్కువగా సినిమాలు చూసేదాన్ని. రీసెంట్ గా 'అఖిల్' సినిమా చూసాను. నాకు నచ్చింది. అఖిల్ మంచి డాన్సర్.

సినిమాల్లోకి రావాలనే ఆలోచన ఎలా వచ్చింది..?

కమర్షియల్ యాడ్ లో నటిస్తున్నప్పుడు మొదటిసారి కెమెరా ఫేస్ చేసినప్పుడు నాకు ఎందుకో ఆ ఫీల్ బాగా నచ్చింది. దాంతో సినిమాల్లోకి రావాలని డిసైడ్ అయ్యాను.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

డిస్కషన్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఫైనల్ చేసి చెబుతాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement