Advertisement

సినీజోష్ ఇంటర్వ్యూ-మురళి శర్మ

Fri 06th Nov 2015 06:07 PM
murali sharma interview,bhale bhale magadivoy,athithi movie  సినీజోష్ ఇంటర్వ్యూ-మురళి శర్మ
సినీజోష్ ఇంటర్వ్యూ-మురళి శర్మ
Advertisement

'అతిథి', 'కంత్రి', 'ఊసరవెల్లి' వంటి చిత్రాల్లో విలన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు మురళి శర్మ. రీసెంట్ గా ఆయన నటించిన 'భలే భలే మగాడివోయ్' సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. హీరోయిన్ తండ్రి పాత్రలో మురళి శర్మ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మురళి శర్మ తన అనుభవాల గురించి విలేకర్లతో ముచ్చటించారు.

'అతిథి' సినిమా నుండి తెలుగులో కెరీర్ మొదలు..

మహేష్ బాబు గారు హీరోగా నటించిన 'అతిథి' చిత్రంలో విలన్ గా అవకాసం రావడంతో ఆ సినిమాలో నటించాను. సినిమా రిలీజ్ అయిన తరువాత టీం అందరితో కలిసి సినిమా చూసాను. థియేటర్ నుండి బయటకు వచ్చినప్పుడు మొదటిసారి నా జీవితంలో లాఠీ చార్జ్ చూసాను. మహేష్ బాబు గారి కోసం వారి అభిమానులు ఎగబడి వచ్చారు. మహేష్ లవ్లీ పర్సన్. ఆ సినిమా నుండి రీసెంట్ గా రిలీజ్ అయిన 'భలే భలే మగాడివోయ్' వరకు నా జర్నీ బాగా కొనసాగింది. 

నాలో పాజిటివ్ షేడ్ చూసారు..

అప్పటివరకు నెగటివ్ రోల్స్ చేస్తున్న నాకు సడెన్ గా 'భలే భలే మాగాడివోయ్' సినిమాలో ఓ మంచి తండ్రి పాత్రలో నటించే అవకాసం వచ్చింది. ఆ పాత్రలో నేను నతించగలనా అని అనుమానం ఉండేది. కాని ఈరోజు ఆ పాత్రకు అంత మంచి అప్లాజ్ వస్తుందంటే దానికి కారణం మారుతి గారే. ఆయన నాలో పాజిటివ్ షేడ్ చూసి సెలెక్ట్ చేసారు. పాత్ర కోసం నేను కష్టపడలేదు. మారుతి గారు ఎలా చెప్తే అలా చేసేవాడిని. ఆయనను బ్లైండ్ గా ఫాలో అయ్యి నటించాను.

ఎక్కడా నెల జీతం తీసుకోలేదు..

కాలేజీలో స్టేజీ షోలో నటించేవాడిని. అది నా లైఫ్ లో ఇంత సీరియస్ టర్న్ తీసుకుంటుందనుకోలేదు. చదువు మీద శ్రద్ధ పెట్టలేక యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయ్యాను. డబ్బు సంపాదించాలని టెలిఫోన్ ఆపరేటర్ గా, ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేసాను. కాని ఎక్కడ నెల రోజులు పూర్తిగా పని చేయలేదు. జర్నలిజం మాత్రం సీరియస్ గా చేసాను. 2000 సంవత్సరంలో టెలి ఫిలిం చేసాను. అప్పటి నుండి నా కెరీర్ ఊపందుకుంది. 2004 లో షారుఖాన్ తో కలిసి నటించిన 'మై హో నా' సినిమా రిలీజ్ అయిన తరువాత నాకు మంచి అవకాశాలు రావడం మొదలయ్యాయి. 

'అతిథి' లో అందుకే సెలెక్ట్ చేసుకున్నారు..

హిందీలో 'బ్లాక్ ఫ్రైడే' అనే సినిమాలో నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాను. అలానే మరో హిందీ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాను. డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఆ రెండు చిత్రాలు చూసి 'అతిథి' సినిమాలో నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఆ చిత్రంలో కూడా మొదటి భాగంలో సిన్సియర్ పోలీసు ఆఫీసర్ గా రెండో భాగంలో విలన్ గా కనిపించాలి. ఆ పాత్రకు నేను యాప్ట్ అవుతానని సురేందర్ భావించాడు. నా మొదటి తెలుగు చిత్రానికే నంది అవార్డు తీసుకోవడం నాకు, నా ఫ్యామిలీకు చాలా సంతోషంగా అనిపించింది. ఆ తరువాత 'కంత్రి, ఊసరవెల్లి, చట్టం, ఎవడు, గోపాల గోపాల' వంటి చిత్రాల్లో నటించాను. 'భలే భలే మగాడివోయ్' మాత్రం నటునిగా నాకు మంచి పేరు తీసుకొచ్చింది.

రియల్ లైఫ్ లో పుస్తకాలే నా ఫ్రెండ్స్..

స్క్రీన్ పై కనిపించే విధంగా నిజ జీవితంలో ఉండను. నిజానికి నేను చాలా బోర్ గా ఉంటాను. నాతో ఎప్పుడు రెండు, మూడు పుస్తకాలు ఉంటాయి. అవే నాకు మంచి ఫ్రెండ్స్. ఇంగ్లీష్ లో 'వెన్ యు హేవ్ ఎ బుక్.. యు విల్ నెవర్ బి అలోన్' అని ఒక సామెత ఉంటుంది. అందుకే నా టైం దొరికితే పుస్తకాలు చదువుతూనే ఉంటాను.

కాప్ పాత్రలు గ్యాప్ తీసుకొని చేస్తా..

హిందీ లో చాలా చిత్రాల్లో కాప్ పాత్రల్లో నటించాను. దాని వలన ఆ క్యారెక్టర్ లో మాత్రమే బాగా చేయగలడని అందరు అనుకుంటున్నారు. అందుకే ఒక దానికి మాత్రమే పరిమితం కాకుండా అన్ని రకాల పాత్రలు చేయాలనుంది. నాలుగైదు చిత్రాలకు మధ్య  గ్యాప్ తీసుకుంటూ పోలీస్ పాత్రల్లో నటిస్తాను.

చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి..

'భలే భలే మగాడివోయ్' సినిమాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. రీసెంట్ గా మారుతి పుట్టినరోజు వేడుకలకు హాజరైతే ఇండస్ట్రీ వాళ్ళు కూడా బాగా అప్రిషియేట్ చేసారు. బయటకు వెళ్తే నన్ను అందరు గుర్తు పట్టి 'భలే భలే మగాడివోయ్ లో బాగా నటించారు సర్ ఒక్క ఫోటో తీసుకుంటాను అని అడుగుతున్నారు. నటునిగా అంతకు మించి కావాల్సింది ఏముంటుంది..? చెప్పండి. ఆ క్యారెక్టర్ లో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది.

నేనే డబ్బింగ్ చెబుతున్నాను..

తెలుగులో రిలీజ్ అయిన 'అతిథి', 'కంత్రి' చిత్రాలకు తప్పించి మిగిలిన అన్ని సినిమాలకు డబ్బింగ్ నేనే చెప్పాను. మా అమ్మ పుట్టింది గుంటూరులోనే. నాన్నగారు బొంబాయిలో సెటిల్ అవ్వడం వలన అక్కడకి వెళ్ళిపోయాము. ఇంట్లో అప్పుడప్పుడు తెలుగు మాట్లాడతాం. తెలుగు సినిమాల్లో నటిస్తున్నప్పటి నుండి తెలుగు ఇంకా బాగా నేర్చుకున్నాను. నా అసిస్టెంట్ తో మాట్లాడుతూ.. తెలుగు బాగా ప్రాక్టీస్ చేసేవాడ్ని. 

లెంగ్త్ చూడను..

సినిమాలో నా నిడివి ఎంతసేపు ఉంటుందని చూడను. స్క్రిప్ట్, నా క్యారెక్టర్ నచ్చితే నటించడానికి ఒప్పుకుంటాను. నా సినిమాలు చూస్తే సినిమా క్యారెక్టర్ తో లింక్ అయ్యి ఉంటుంది.

పాజిటివ్ క్యారెక్టర్స్ లో నటించమంటున్నారు..

'భలే భలే మగాడివోయ్' సినిమాతో పాజిటివ్ రోల్స్ లో నటించమని చాలా మంది అడుగుతున్నారు. ప్రస్తుతం హీరో సుశాంత్ తో చేస్తున్న సినిమాలో పాజిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోనే నటిస్తున్నాను.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హ్యాపీగా ఉన్నాను..

నటునిగా చాలా సంతోషంగా ఉన్నాను. తక్కువ సమయంలోనే ఎన్నో చిత్రాల్లో నటించాను. ప్రస్తుతం హిందీలో నేను నటించిన సనమ్ తేరి కసం, వజీర్ చిత్రాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. నాకు ఎలాంటి పాత్రలు వచ్చిన ఎఫర్ట్ పెట్టి నటిస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement