Advertisement

ఏపీ కోసం తెలంగాణలో బలి ఇస్తున్న బాబు..!!

Sun 25th Oct 2015 03:31 AM
tdp,bjp,warangal by elections,mlc elections  ఏపీ కోసం తెలంగాణలో బలి ఇస్తున్న బాబు..!!
ఏపీ కోసం తెలంగాణలో బలి ఇస్తున్న బాబు..!!
Advertisement

ఎన్నికలకు ముందు టీడీపీ, బీజేపీల మైత్రి బంధం తెలుగుదేశానికి చాలా మేలే చేసింది. కాని ఇప్పుడు బీజేపీ కోసం టీడీపీ తన మూలాలకే దెబ్బ తెచ్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ల తర్వాత అత్యధిక స్థానాల్లో టీడీపీ గెలుపొందింది. కాని ఇప్పుడు తన స్థానాన్ని బీజేపీ కోసం ఆ పార్టీ త్యాగం చేస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బరిలోకి దిగడంతో టీడీపీ పక్కకు తప్పుకుంది. ఇక తాజాగా వరంగల్‌ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ పోటీ చేయడం ఖాయం కావడంతో టీడీపీ పక్కకు తప్పుకోక తప్పట్లేదు.

వరంగల్‌ ఉప ఎన్నికల్లో రంగంలోకి దిగడానికి బీజేపీ, టీడీపీ నుంచి అభ్యర్థులు పోటీపడ్డారు. ఇక ఈ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల్లో ఏది బరిలోకి దిగుతుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. కాని మొదటినుంచి కూడా వరంగల్‌లో బీజేపీయే పోటీ చేస్తుందని, టీడీపీ పక్కకు తప్పుకోక తప్పదనే వాదనలు వినిపించాయి. ఇప్పుడు ఈ వాదనలనే నిజం చేస్తూ తాము ఎన్నికల్లో పోటీ చేయమని, బీజేపీకి మద్దతు పలుకుతామని టీడీపీ ప్రకటించింది. వరంగల్‌ బీజేపీ కంటే కూడా టీడీపీయే బలంగా ఉంది. ఆ పార్టీకి బలమైన అభ్యర్థులే కాకుండా క్యాడర్‌ కూడా ఉంది. ఏ లెక్కన చూసుకున్నా.. బీజేపీ కంటే కూడా టీడీపీయే బలంగా ఉంది కాని. అయితే ఇప్పుడు బరిలోంచి టీడీపీ పక్కకు తప్పుకోవడం తెలుగు తమ్ముళ్లకు ఏమాత్రం రుచించడం లేదు. ఎర్రబెల్లి దయాకర్‌ వంటి ప్రముఖులున్న జిల్లాలోనే బీజేపీ కోసం పక్కకు తప్పుకుంటే ఇక టీడీపీ బలహీనంగా ఉన్న స్థానాల సంగతేంటని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఇలా ఎన్నికలకు దూరంగా ఉంటూ వస్తే.. క్యాడర్‌ కూడా పార్టీ వీడి వెళ్లిపోతుందని, ఇది తెలంగాణలో టీడీపీ మూలాలనే దెబ్బతీస్తుందని తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు. ప్రధానిని ప్రసన్నం చేసుకొని ఏపీకి అధిక నిధులు రప్పించుకునేందుకు తెలంగాణలో పార్టీని బలి ఇవ్వడం ఏమాత్రం సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణలో టీడీపీ కంటే కూడా తామే బలంగా ఉన్నామని, అందుకే వరంగల్‌ బరిలోకి దిగుతున్నట్లు బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఈ లెక్కన భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో పొత్తు ధర్మం కోసం టీడీపీ బరిలోంచి పక్కకు తప్పుకొని బలహీనపడక తప్పదేమో.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement