Advertisement

సినీజోష్ ఇంటర్వ్యూ-ప్రగ్య జైస్వాల్

Thu 22nd Oct 2015 04:08 AM
pragya jaiswal interviw,kanche movie,krish,varun tej  సినీజోష్ ఇంటర్వ్యూ-ప్రగ్య జైస్వాల్
సినీజోష్ ఇంటర్వ్యూ-ప్రగ్య జైస్వాల్
Advertisement

వరుణ్ తేజ్, ప్రగ్య జైస్వాల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, మరియు సాయి బాబు జాగర్లమూడి సంయుక్తం గా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని దసరా కానుకగా అక్టోబర్ 22న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

సినిమాలో మీ పాత్ర గురించి..?

రాచకొండ సీతాదేవి పాత్రలో కనిపిస్తాను. సంపన్న కుటుంబానికి చెందిన తను ఏదైతే కరెక్ట్ అనుకుంటుందో.. అదే చేస్తుంది. ఆ విషయంలో ఎవరిమాట వినదు. ఇదొక పీరియాడిక్ ఫిలిం. రెండో ప్రపంచయుద్ధ నేపధ్యంలో జరిగే కథ. 1930 కు చెందిన సీతాదేవి కాలేజీలో ఓ అబ్బాయితో ప్రేమలో పడుతుంది. తన ప్రేమను ఎలా గెలిపించుకుందనేదే ఈ సినిమా కథ.

ఈ చిత్రంలో నటించే అవకాసం ఎలా వచ్చింది..?

హిందీలో గబ్బర్ సినిమా ఆడిషన్స్ కు వెళ్లాను. ఆడిషన్ అప్పుడు నన్ను గుర్తుపెట్టుకొని కంచె సినిమా ఆడిషన్ కు రమ్మని ఫోన్ వచ్చింది. నా నటన నచ్చడంతో హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసారు. నా మోడలింగ్ ప్రాజెక్ట్స్, నేను ఇంతకముందు చేసిన సినిమాల అనుభవం నేను కంచె కు ప్రిపేర్ అయ్యేలా చేసాయి.

పాత్ర కోసం ఏమైనా హోంవర్క్ చేసారా..?

ఈ తరం అమ్మాయిలకు 1900 సంవత్సరానికి చెందిన అమ్మాయిలకు చాలా తేడా ఉంటుంది. నడవడిక, మాట తీరు, లుక్ ఇలా ప్రతి దాంట్లో వేరియేషన్ ఉంది. దానికోసం ఎంతో రీసెర్చ్ చేసాను. ఎలా డ్రెస్ చేసుకోవాలి, నా లుక్ ఎలా ఉండాలనే వాటిపై చాలా శ్రద్ధ పెట్టాను. పాత హిందీ, ఇంగ్లీష్ సినిమాలు చూసాను. మహారాణి గాయత్రి దేవి లుక్ ను నాకు రిఫరెన్స్ గా ఇచ్చారు. కంప్లీట్ గా మా శ్రద్ధ అంతా క్రిష్ గారి విజన్ మీదే ఉండేది. ఆయన ఎలా చెప్తే అలా చేసాను. 

షూటింగ్ లో కష్టంగా ఫీల్ అయిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా..?

ఈ సినిమాలో పండగకు సంబంధించిన ఒక పాట ఉంటుంది. పొలాల గట్ల మధ్య డాన్సు చేయాలి. కళ్ళకు చెప్పులు వేసుకోకుండా రాళ్ళు, మొక్కల మధ్య డాన్సు చేయడం చాలా కష్టంగా అనిపించింది. అదే కాకుండా వర్షంలో ఓ ముఖ్యమైన సన్నివేసం షూట్ చేయాలి. నేను కళ్ళు బ్లింక్ చేయకుండా ఎదురుగా ఉన్న మనిషిని చూస్తూ.. డైలాగ్ చెప్పాలి. అప్పుడు కూడా కష్టంగా అనిపించింది.

క్రిష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్..?

ఆయన నాకు గురువు లాంటి వారు. చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుండి. నాలో ఉన్న నటనను ఆయన బయటకి తీసారు. కంచె క్రిష్ గారి యాంబిషియస్ ప్రాజెక్ట్.

వరుణ్ తో కలిసి వర్క్ చేయడం ఎలా అనిపించింది..?

వరుణ్ మంచి మనిషి. చాలా ఫ్రెండ్లీ గా ఉంటాడు. తనలో ఎలాంటి గర్వం ఉండదు. సపోర్టివ్ కో యాక్టర్. దూపాటి హరిబాబు పాత్రలో అధ్బుతంగా నటించాడు. రిహార్సల్స్ చేయకుండా నటించేసేవాడు. 

మీ బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి..?

నాగబాబు గారు నన్ను ఈ సినిమాలో చూసి నిజంగా మహారాణి లా ఉన్నావు. పాత సినిమాలో కాంచన గారిలా ఉన్నావని చెప్పారు. అలానే కంచె ఆడియో రోజు రామ్ చరణ్ స్టేజీ మీద అందంగా ఉన్నావని చెప్పారు. మెగా ఫ్యామిలీ నుండి మంచి సపోర్ట్ ఉంది.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

హిందీ, తెలుగు స్క్రిప్ట్స్ వింటున్నాను. త్వరలోనే కన్ఫర్మ్ చేసి చెప్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement