Advertisement

సినీజోష్ ఇంటర్వ్యూ-ఓంకార్

Mon 19th Oct 2015 10:53 AM
omkar,raju gari gadi movie,ashwin babu,anil sunkara  సినీజోష్ ఇంటర్వ్యూ-ఓంకార్
సినీజోష్ ఇంటర్వ్యూ-ఓంకార్
Advertisement

అశ్విన్ బాబు, చేతన్, ధన్య బాలకృష్ణన్ ప్రధాన పాత్రల్లో ఓక్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం రాజు గారి గది. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ఓంకార్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

కొత్త హారర్ సబ్జెక్టు..

నందిగామం అనే గ్రామంలో ఓ మహల్ ఉంటుంది. ఆ మహల్ లోకి వెళ్ళిన వారందరూ చనిపోతుంటారు. అలాంటి మహల్ లోకి ఏడుగురు యువతీ యువకులు వెళ్లి పోలీసులకు కూడా అంతుపట్టని ఓ మిస్టరీను చేదిస్తారు. హారర్ నేపధ్యంలో సాగే ఈ కథలో చివరి ఇరవై నిమిషాలు చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. హారర్ జోనర్ లో ఎన్నో చిత్రాలొచ్చాయి కానీ ఈ సినిమా వాటన్నింటికీ భిన్నంగా ఉంటుంది. 

అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేశా..

నా మొదటి సినిమా జీనియస్ కు 6 కోట్ల బడ్జెట్ అనుకుంటే 10 కోట్లు దాటిపోయింది. దర్శకునిగా నాకు ప్రొడ్యూసర్ గారికి అది మొదటి చిత్రం అవ్వడంతో ఎక్కువగా ఖర్చు పెట్టేశాం. మేము అనుకున్న కమర్షియల్ హిట్ మాత్రం మాకు దక్కలేదు. దాంతో నా తదుపరి చిత్రం చిన్న బడ్జెట్ లో తీసి కమర్షియల్ హిట్ కొట్టాలని రాజు గారి గది మొదలుపెట్టాను. అనుకున్నట్లుగానే మూడు కోట్ల బడ్జెట్ లో సినిమా తీశాను. 50 రోజులు షూటింగ్ అనుకుంటే 42 రోజుల్లోనే పూర్తి చేసాం. 

కావాలనే ఈ సబ్జెక్టు సెలెక్ట్ చేశా..

చిన్న బడ్జెట్ లో సినిమా తీసి హిట్ కొట్టాలంటే హారర్ సబ్జెక్టు కరెక్ట్ అని భావించాను. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు చూడగలిగే ఈ సబ్జెక్టు ను కావాలనే సెలెక్ట్ చేసాను. అందరు ఎంజాయ్ చేసే విధంగా ఈ సినిమా ఉంటుంది. దర్శకునిగా అన్ని జోనర్స్ లో సినిమాలు చేయాలనుంది. 

నాకు లైఫ్ ఇచ్చిన షో అది..

ప్రస్తుతం దర్శకునిగా సినిమా చేస్తున్నందుకు టెంపరరీగా టివి షోస్ కు గ్యాప్ ఇచ్చాను. ఈ సినిమా తరువాత షోస్ కంటిన్యూ చేస్తాను. ఆట నా కెరీర్ ను చేంజ్ చేసిన షో. ఆ ప్రోగ్రాం లో నా తమ్ముడు అశ్విన్ కంటెస్టంట్ గా చేసాడు. కాని నా తమ్ముడు గెలిస్తే కావాలనే గెలిపించామనుకుంటారని చివర్లో కావాలనే ఎలిమినేట్ చేసాం. అలానే వాడిని హీరోగా పెట్టి జీనియస్ సినిమా ఓపెనింగ్ కూడా చేసేసాం. నిర్మాతల వలన మళ్ళీ తనను హీరోగా మాని చిన్న పాత్రకు మాత్రమే పరిమితం చేయాల్సివచ్చింది. దాంతో నా తమ్ముడికి లైఫ్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో చేసిన ప్రయత్నమే ఈ రాజు గారి గది. కేవలం ఒక మూవీలో నటించిన అనుభవంతోనే ఈ సినిమాలో బాగా నటించాడు.

బిజినెస్ బాగా జరిగింది..

సెప్టెంబర్ 17న మేము ట్రైలర్ రిలీజ్ చేసాం. 18 ఉదయంలోపు బిజినెస్ మొత్తం కంప్లీట్ అయింది. ట్రైలర్ కు అంత మంచి రెస్పాన్స్ వచ్చింది. అనిల్ సుంకర, సాయి కొర్రపాటి గారు పిలిచి మరి సినిమా తీసుకున్నారు. అంత పెద్ద ప్రొడ్యూసర్స్ సపోర్ట్ తో సినిమా రిలీజ్ అవ్వడం సంతోషంగా ఉంది. లాభాల కోసం ఈ సినిమా చేయలేదు. టేబుల్ ప్రాఫిట్ వస్తే చాలనుకుంటున్నాను.  

బెస్ట్ కాంప్లిమెంట్ అది..

తక్కువ బడ్జెట్ లో చాలా గ్రాండియర్ గా సినిమా చేసానని సాయి కొర్రపాటి గారు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆయన దిక్కులు చూడకు రామయ్య సినిమా అతి తక్కువ బడ్జెట్ లో తీసి హిట్ కొట్టారు. నన్ను మించి ఎవరు తక్కువ బడ్జెట్ లో సినిమా చేయలేరనుకున్నాను కాని నువ్వు బాగా తీసావని చెప్పారు. చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు.

అవే హైలైట్స్..

ఫోటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎఫెక్ట్స్ సినిమాకు హైలైట్స్ గా నిలుస్తాయి. ప్రేక్షకులు సినిమా చూస్తూ.. భయపడుతూనే నవ్వుతూ.. ఉంటారు. అంత హిలారియాస్ గా ఉంటారు. గ్రాఫిక్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా కథను నమ్ముకొని సినిమా తీశాను.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్.. 

రాజు గారి గది2 స్టొరీ రెడీ చేసుకున్నాను. అది కాకుండా ఫ్యామిలీ ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో ఓ సబ్జెక్టు సిద్ధం చేసుకున్నాను. ఈ సినిమా సక్సెస్ బట్టి తదుపరి చిత్రం ఏం చేయాలో డిసైడ్ అవుతాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.        

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement