నగ్మాకు భారీ కానుకనిచ్చిన రాహుల్‌గాంధీ..!

Thu 08th Oct 2015 04:26 AM
nagma,rahulgandi,congress,general secretary  నగ్మాకు భారీ కానుకనిచ్చిన రాహుల్‌గాంధీ..!
నగ్మాకు భారీ కానుకనిచ్చిన రాహుల్‌గాంధీ..!
Sponsored links

టాలీవుడ్‌, కోలీవుడ్‌లలో అగ్రతారగా వెలుగొందిన నగ్మా అటుపై బాలీవుడ్‌లోనూ కొన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత ఆమె సినిమాలకు దూరమై రాజకీయాల బాట పట్టారు. రాజకీయాల్లో చేరిన అనతికాలంలోనే ఆమె బాగానే పైకి ఎదిగారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో కొనసాగుతున్న నగ్మాకు రాహుల్‌గాంధీ భారీ కానుక ఇచ్చారు. కాంగ్రెస్‌ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా ఆమెను ఎంపిక చేశారు.

నగ్మాకు వెటరన్‌ హీరోయిన్‌గా దేశవ్యాప్తంగా ఫాలోయింగ్‌ ఉంది. ఆ ఫాలోయింగ్‌ చూసి ఆమెను గత ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో ప్రచారానికి కాంగ్రెస్‌ వినియోగించుకుంది. ఇక యూపీలో ఆమె ప్రచారం చేస్తుండగా కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి ఆమెను బహిరంగంగా ముద్దాడటం అప్పుడు సంచలనంగా మారింది. ఇక ఈ విషయాన్ని పక్కనపెడితే కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగానికి కొత్త కమిటీని ఏర్పాటుచేసింది. ఇదివరకు ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న శోభా ఓఝాను మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమించారు. ఇక నగ్మాను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నగ్మాను నియమిస్తూ రాహుల్‌గాంధీ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై పలువురు నాయకులు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక టాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించిన నగ్మాకు ఈ పదవి దక్కడం పలువురు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019