Advertisement

సినీజోష్ ఇంటర్వ్యూ-కొరటాల శివ

Wed 29th Jul 2015 04:22 AM
koratala siva,sreemanthudu,mahesh babu,sruthihasan  సినీజోష్ ఇంటర్వ్యూ-కొరటాల శివ
సినీజోష్ ఇంటర్వ్యూ-కొరటాల శివ
Advertisement

రచయితగా తన సినీ ప్రయాణం మొదలుపెట్టి 'మిర్చి' చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన రైటర్ కమ్ డైరెక్టర్ కొరటాల శివ. ప్రస్తుతం ఆయన మహేష్ బాబు, శ్రుతిహాసన్ జంటగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వై.నవీన్, వై.రవిశంకర్, సి.వి.మోహన్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'శ్రీమంతుడు' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాలశివ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

సినిమా ఎలా ఉండబోతోంది..?

సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి ఓ విలేజ్ ను దత్తత తీసుకునే అంశాలకు కమర్షియల్ ఫార్మాట్ ను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ సినిమాలో మల్టిపుల్ ఎమోషన్స్ ఉంటాయి. ఒక ఎక్స్ ప్రెషన్ ను మాత్రమే తీసుకొని టైటిల్ పెడితే మిగిలిన అంశాలు మిస్ అవుతాయనే ఉద్దేశ్యంతో 'శ్రీమంతుడు' అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసాం. కథలో నుండి వచ్చిన టైటిలే ఇది. 

మహేష్ బాబు తో ప్రయాణం ఎలా అనిపించింది..?

నా మొదటి సినిమా 'మిర్చి' తరువాత రామ్ చరణ్ తో సినిమా చేయాల్సివుంది కాని అది సెట్స్ పైకి వెళ్ళలేదు. ఆ సమయంలోనే మహేష్ బాబు తో సినిమా కన్ఫర్మ్ అయింది. అప్పుడు ఆయన 'ఆగడు' షూటింగ్ లో ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేసి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాం. మొదట ఈ స్టొరీ లైన్ మహేష్ గారికి చెప్పినపుడు చాలా ఎగ్జైట్ అయ్యారు. దత్తత తీసుకోవడం అనే పాయింట్ ను కమర్షియల్ గా చెప్పడం ఆయనకు బాగా నచ్చింది. ఈ సినిమా కోసం నాకంటే ఆయనే ఎక్కువగా హొమ్ వర్క్ చేసారు. 

మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోంది..?

ఇప్పటివరకు మహేష్ బాబు ను ఇలాంటి పాత్రలో ఎవరు చూపించలేదు. పుట్టుకతోనే బిలియనీర్ అయినా చాలా సింపుల్ గా ఉంటాడు. సైకిల్ మీద తిరుగుతూ ఉంటాడు. డిఫరెంట్ లైఫ్ స్టైల్. క్లుప్తంగా మాట్లాడతాడు. సింపుల్ గా డ్రెస్ చేసుకుంటాడు. తనకు నచ్చింది మాత్రమే చేస్తాడు. ఈ క్యారెక్టర్ కోసం షూటింగ్ కు నెల రోజుల ముందు నుండి ప్రిపేర్ అయ్యారు.

ఈ సినిమాలో స్పెషల్స్ ఏంటి..?

మిర్చి లో ఒక రకమైన ఎమోషన్స్ ను చూపించాం. ఇందులో అంతకు మించిన ఎమోషన్స్ ఉంటాయి. రెగ్యులర్ కుటుంబ కథా చిత్రాల్లో ఉండే సీన్స్ ఈ సినిమాలో ఉండవు. ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని డిఫరెంట్ ఎమోషన్స్ ను ఈ సినిమాలో చూపించబోతున్నాం. శ్రీమంతుడు పాత్రే ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. మహేష్ బాబు చెప్పే డైలాగ్స్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. సినిమాలో అనవసరమైన పాటలు కాని, ఫైట్స్ కాని ఉండవు. ప్రతిది సినిమాలో భాగంగానే ఉంటాయి

జగపతిబాబు ను ఫాదర్ క్యారెక్టర్ లో తీసుకోవడానికి కారణం..?

ఈ సినిమాలో మహేష్ తండ్రి గా అందంగా, రిచ్ గా ఉండే వారు కావాలి. ఆ పాత్రకు జగపతిబాబు గారు సూట్ అవుతారనిపించింది. ఆయనను మొదట అడగడానికి భయపడ్డాను. కాని కథ విన్న వెంటనే ఆయన నటించడానికి ఒప్పుకున్నారు. అలానే తల్లి పాత్రలో సుకన్య గారు నటిస్తున్నారు. 25 సంవత్సరాల తరువాత మరలా 'పెద్దరికం' సినిమా కాంబినేషన్ ప్రేక్షకులు చూడబోతున్నారు.

ప్రొడ్యూసర్స్ గురించి..?

మొదటిసారి ప్రొడ్యూస్ చేసే నిర్మాతలు చాలా ప్యాషనేట్ గా ఉంటారు. వాళ్ళతో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్ గా అనిపించింది. ఏ కథ అయినా అనుకున్న బడ్జెట్ లోనే తీస్తాం. మా లిమిటేషన్స్ మాకుంటాయి.

శ్రుతిహాసన్ పాత్ర గురించి..?

నా సినిమాలలో హీరోయిన్స్ క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాను. కేవలం పాటలకు, కొన్ని సన్నివేశాలకు మాత్రమే అన్నట్లుగా క్యారెక్టర్ డిజైన్ చేయను. ఈ చిత్రంలో శ్రుతిహాసన్ బోల్డ్ గా డైనమిక్ గా ఉండే క్యారెక్టర్ లో నటించింది.

రైటర్స్ అంతా డైరెక్టర్స్ గా మారితే రచయితల కొరత ఏర్పడదా..?

ప్రతి దర్శకుడిలో ఓ రచయిత ఉంటాడనేది నా అభిప్రాయం. పుట్టుకతోనే ఎవరు రచయితలుగా పుట్టరు. నేను డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకు వచ్చాను. కాని కథలో కూడా ప్రావీణ్యం పొందాలని స్క్రిప్ట్ వర్క్ నేర్చుకున్నాను. రచయితలే దర్శకులుగా మారితే అసలు ప్రాబ్లం ఉండదు.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

ప్రస్తుతం రెండు, మూడు ఆప్షన్స్ ఉన్నాయి. కన్ఫర్మ్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాను. ఏదో వెంట వెంటనే సినిమాలు చేసే ఆలోచనలైతే లేవు. కొత్త రకమైన ఎమోషన్స్ వెతకడానికి కాస్త సమయం పడుతుంది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement