Advertisement

తిడితే తప్పేలేదంటున్న సీఎం..!!

Wed 15th Jul 2015 08:31 AM
mulayam singh,ips,amithab thakur,akhilesh yadav  తిడితే తప్పేలేదంటున్న సీఎం..!!
తిడితే తప్పేలేదంటున్న సీఎం..!!
Advertisement

రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లది ప్రత్యేకశైలి. అక్కడ బెదిరింపులు, విచక్షణరహితంగా ఆరోపణలు సర్వసాధారణం. పోలింగ్‌ బూతుల వద్ద పోలీసులతోపాటు పార్టీల కార్యకర్తలు కూడా తుపాకులు పట్టుకొని పహారా కాస్తారు. ఇక ఈ మధ్య కాలంలో బీహార్‌ పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తున్నా.. యూపీలో మాత్రం పరిస్థితి మరింత దిగజారుతోంది. తమకు నచ్చని వ్యక్తులను యూపీ అధికారపార్టీ ముప్పతిప్పలు పెడుతోంది. తాజాగా మాజీ సీఎం, ఎస్‌పీ పార్టీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌ తనను బెదిరిస్తున్నారంటూ ఆరోపించిన ఐపీఎస్‌ అధికారి అమితాబ్‌ఠాకూర్‌కు అక్కడి ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది.

ఓ పని విషయమై ఐపీఎస్‌ అమితాబ్‌కు ఫోన్‌ చేసిన ములాయం ఇష్టారీతిగా దూషించారని, తాను చెప్పినట్లు వినకపోతే ముప్పు అంటూ హెచ్చరించారని బాధిత ఐపీఎస్‌ చెప్పారు. ఇది తీవ్ర దుమారం రేపింది. ఐపీఎస్‌ల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక సదరు ఐపీఎస్‌కు దేశవ్యాప్తంగా సానుభూతి వెల్లువెత్తుతుండగా.. ఇవేమీ పట్టించుకోని అక్కడి ప్రభుత్వం ఆయనపై కక్షపూరిత చర్యలకు దిగింది. ములాయం దూషించిన విషయాన్ని బహిర్గతం చేసిన రెండు రోజుల్లోనే ఆయనపై రేప్‌ కేసు నమోదు చేసింది. దీనికితోడు ఆయన్ను విధులనుంచి కూడా సస్పెండ్‌ చేస్తూ తమతో పెట్టుకుంటే పాట్లు తప్పవంటూ హెచ్చరికలు పంపించింది. ఇక ప్రభుత్వ చర్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న అక్కడి సీఎం అఖిలేష్‌యాదవ్‌ పట్టించుకోకుండా సమర్థించుకోవడం గమనార్హం. తన తండ్రి అయిన ములాయం తననే ఇష్టారీతిగా తిడతారని, అలాంటిది ఓ ఐపీఎస్‌ను తిట్టడంలో కొత్త ఏముందంటూ వెనుకేసుకొచ్చారు. త్వరలోనే యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో చోటుచేసుకుంటున్న ఈ సంఘటనలు మరి ఆ పార్టీని ఎన్నికల్లో దెబ్బతిస్తాయన్న భయం కూడా లేకుండా ఎస్పీ నాయకులు ఇష్టారీతిగా మాట్లాడటం మీడియా వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. అయితే అక్కడి ప్రజలు ఇలాంటి సంఘటనలను పట్టించుకోరన్న భావనతోనే ఎస్పీ రెచ్చిపోతున్నట్లు రాజకీయవిశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement