దుబాయ్ లో ఘనంగా సైమా అవార్డ్స్ వేడుక..!

Thu 02nd Jul 2015 03:06 AM
siima awards,brunda prasad,rana,shreya,adah sharma  దుబాయ్ లో ఘనంగా సైమా అవార్డ్స్ వేడుక..!
దుబాయ్ లో ఘనంగా సైమా అవార్డ్స్ వేడుక..!
Advertisement

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలు కలిసి జరుపుకునే వేడుక సైమా అవార్డ్స్. నాలుగోసారి ఈ అవార్డు వేడుక జరుగుతున్న సందర్భంగా హైదరాబాద్ లోని విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా..

సైమా చైర్ పర్సన్ బృందా ప్రసాద్ మాట్లాడుతూ "గత సంవత్సరం ఈ వేడుకలను మేమే నిర్వహించాం. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మేమే నిర్వహించనున్నాం. ఆగస్ట్ 6,7 తేదీలలో దుబాయ్ లో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ రెండు రోజుల్లో ఇరవై పెర్ఫార్మన్సెస్ జరుగుతాయి. సినీ పరిశ్రమకు చెందిన పెద్దలంతా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో మైక్రో మాక్స్ సేల్స్ హెడ్ తిరుమల రెడ్డి, షర్మిలా మాండ్రే, రానా, పూజా హెగ్డే, ఆదా శర్మ, శ్రేయా, కృతి కర్భందా తదితరులు పాల్గొని దక్షిణాదికి చెందిన నాలుగు సినీ పరిశ్రమలు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు.

 

 


Loading..
Loading..
Loading..
advertisement