Advertisement

ట్విట్టర్‌ను ఆయుధం చేసుకున్న కేటీఆర్‌..!!

Fri 26th Jun 2015 09:36 AM
ktr,twitter,narendra modi,emergency  ట్విట్టర్‌ను ఆయుధం చేసుకున్న కేటీఆర్‌..!!
ట్విట్టర్‌ను ఆయుధం చేసుకున్న కేటీఆర్‌..!!
Advertisement

సోషల్‌ మీడియాలో నరేంద్రమోడీ చాలా యాక్టీవ్‌గా ఉంటారు. పలు అంశాలపై ఆయన ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తుంటారు. తాజాగా దేశంలో ఎమర్జెన్సీ విధించి 4 దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ట్విట్టర్‌ ద్వారా దేశ ప్రజలకు ఆయన సందేశం పంపారు. భారతదేశపు చీకటిరోజుల్లో ఒక్కటైన ఎమర్జెన్సీ విధించి 40 ఏళ్లు నిండాయని, అప్పటి రాజకీయ నాయకత్వం దేశాన్ని ఉక్కుపాదంతో అణిచివేసిందని మోడీ పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అన్వయించి కేటీఆర్‌ మోడీని సెక్షన్‌-8పై ప్రశ్నించడం ఆసక్తి రేపింది.

ట్విట్టర్‌ ద్వారా కేటీఆర్‌ స్పందిస్తూ.. గౌరవనీయులైన ప్రధానమంత్రిగారు.. ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌లో శాంతిభద్రతలపై  ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హక్కులను కాలరాస్తారంటూ ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కేంద్రం వివేకవంతంగా వ్యవహరిస్తుందని, చరిత్రను పునరావృతం చేయదని ఆశిస్తున్నానంటూ స్పందించారు. ఈ వ్యాఖ్యానంపై ఇప్పటికైతే మోడీ స్పందించలేదు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement