Advertisement

పదవి పోయే సెంటిమెంట్‌ను లెక్కపెట్టని కేసీఆర్‌..!!

Sun 21st Jun 2015 05:48 AM
kcr,vemulawada,sentiment,telangana  పదవి పోయే సెంటిమెంట్‌ను లెక్కపెట్టని కేసీఆర్‌..!!
పదవి పోయే సెంటిమెంట్‌ను లెక్కపెట్టని కేసీఆర్‌..!!
Advertisement

కరీంనగర్‌ జిల్లా వేములవాడ ఆలయానికి ఓ సెంటిమెంట్‌ ఉంది. ఈ ఆలయాన్ని సందర్శిస్తే పదవి పోతుందన్న నమ్మకం నాయకుల్లో కొనసాగుతోంది. అయితే సీఎం కేసీఆర్‌ ఈ సెంటిమెంట్‌ను లెక్కపెట్టకుండా వేములవాడ ఆలయాన్ని సందర్శించారు. దాదాపు ఆలయ పరిసరాల్లో ఆయన ఏడు గంటలపాటు గడిపారు.

గత శివరాత్రి సమయంలోనే వేములవాడకు ముఖ్యమంత్రిగానీ మంత్రులుగానీ ఎవరూ రాలేదన్న విమర్శలు వినిపించాయి. పదవి పోతుందన్న భయంతోనే ఈ ఆలయానికి కేసీఆర్‌ రాలేదన్న విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు సీఎం కేసీఆర్‌ వేములవాడకు వచ్చి ఆ విమర్శలకు సమాధానం చెప్పారు. గతంలో ఈ ఆలయాన్ని సందర్శించిన అనంతరం అంజయ్య, విజయభాస్కర్‌రరెడ్డి, ఎన్టీఆర్‌ల పదవులు ఊడిపోయాయి. ఆ తర్వాత కూడా ఇదే సెంటిమెంట్‌ కొనసాగుతోంది. అయితే వేములవాడకు రావడానికి సీఎం కేసీఆర్‌ చిన్నజీయర్‌ స్వామి సూచనలు కూడా తీసుకున్నట్లు సమాచారం. మొత్తానికి వేములవాడను సందర్శించుకున్న ముఖ్యమంత్రి గత పాలకుల సెంటిమెంట్లను పటాపంచలు చేశారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement