Advertisement

సుబ్బిరామిరెడ్డి 'టిఎస్ఆర్ టీవీ9' అవార్డులు..!

Mon 08th Jun 2015 08:13 AM
subbiramireddy,tsrtv9 awards,jamuna,jayaprada  సుబ్బిరామిరెడ్డి 'టిఎస్ఆర్ టీవీ9' అవార్డులు..!
సుబ్బిరామిరెడ్డి 'టిఎస్ఆర్ టీవీ9' అవార్డులు..!
Advertisement

2010లో లలిత కళా పరిషత్ సంస్థను స్థాపించిన టి.సుబ్బిరామిరెడ్డి ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ9తో కలసి "టిఎస్ఆర్ టీవీ9" నేషనల్ ఫిల్మ్ అవార్డులను అందిస్తున్నారు. ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని ఈ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది.

ఈ సందర్భంగా టి.సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ"అవార్డులు కళాకారులపై ప్రజలకున్న ప్రేమ, అభిమానాలను తెలియజేస్తాయి. కళాకారులకు కొండంత ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తాయి. కళలను ప్రోత్సహించడానికి ఐదు సంవత్సరాల క్రితం టి.సుబ్బిరామిరెడ్డి లలిత కళా పరిషత్ ప్రారంభించాను. ప్రభుత్వం జాతీయ స్థాయిలో అవార్డులు ఇస్తుంది. అవార్డులను చాల మంది ఇస్తున్నారు కాని ప్రజల అభిప్రాయం తీసుకుని అవార్డులు ఇవ్వడం ఎక్కడా జరగలేదు. అందుకే, "టిఎస్సార్ టీవీ9" నేషనల్ ఫిల్మ్ అవార్డులను ప్రజల అభిప్రాయం తీసుకొని ఇస్తున్నాం. 2013, 14 సంవత్సరాలకు ఈ ఏడాది అవార్డులను ఇస్తున్నాం. త్వరలో టీవీ9లో ఎసెమ్మెస్ ద్వారా ప్రజల అభిప్రాయం సేకరిస్తాం. జూలై 15న ప్రజాభిప్రాయలను సేకరించడం ఆపి జూలై 17న అవార్డు విజేతలను ప్రకటిస్తాం. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, పంజాబీ ఇలా భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని భాషలలో అవార్డులను ఇస్తున్నాం. జూలై 19న శిల్పకళా వేదికలో వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. హిందీ చిత్రసీమ నుండి హేమా మాలిని, రిషి కపూర్, అనుపమ్ ఖేర్ తదితరులు పాల్గొంటారు" అని అన్నారు. 

జమున మాట్లాడుతూ "గతంలో కథానాయికలు తెలుగు మాట్లాడేవారు. స్వయంగా డబ్బింగ్ చెప్పుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అరువు గొంతుతో కథానాయికలు నటిస్తున్నారు. డబ్బింగ్ కళాకారులకు కూడా అవార్డులను ఇవ్వాలని నా తరపున టి.సుబ్బిరామిరెడ్డి గారికి కోరుకుంటున్నాను" అని అన్నారు. 

ఈ సమావేశంలో జ్యూరి కమిటీ సభ్యులు జమున, జయప్రద, శోభన కామినేని, పింకీ రెడ్డి, జీవిత, ఎ.కోదండ రామిరెడ్డి, సుమన్ పాల్గొన్నారు.  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement