Advertisementt

సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా తప్పదా..??

Thu 04th Jun 2015 06:34 AM
chandrababu naidu,ap cm,resign,revanth reddy scam  సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా తప్పదా..??
సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా తప్పదా..??
Advertisement
Ads by CJ

రేవంత్‌రెడ్డి ఎపిసోడ్‌తో చంద్రబాబు పూర్తిగా ఆందోళనలో చిక్కుకుపోయినట్లు కనిపిస్తోంది. ఈ వ్యవహారంతో తెలుగు ప్రజల మధ్య టీడీపీని చులకన చేసింది. అంతేకాకుండా తెలంగాణ ఏసీబీ పక్కా ప్లాన్‌తో రచించిన వ్యూహంలో తాను కూడా చిక్కుకుపోయానేమోనన్న ఆందోళన ఇప్పుడు బాబులో కనబడుతున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతను రేవంత్‌కు బాబు అప్పగించారు. ఇదే అదనుగా రంగంలోకి దిగిన ఆయన మొత్తం 5 మంది బేరసారాలు కొనసాగించినట్లు సమాచారం. అయితే ఇందులో కొందరితో చంద్రబాబు కూడా స్వయంగా మాట్లాడినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అంతకుముందే రేవంత్‌ ఫోన్‌ను ట్యాప్‌ చేసిన ఏసీబీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు చేసిన మంతనాలుకూడా రికార్డ్‌ చేసినట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఈ ఆధారాలతో చంద్రబాబును టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా ఇరుకున పడేయవచ్చు. ఆయనపై కేసు నమోదు చేసి టీడీపీని పూర్తిగా ఖాళీ చేసే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వదులుకోదు. అంతేకాకుండా రేవంత్‌ ఎపిసోడ్‌ జరిగినప్పటినుంచి తనకు కంటిమీద నిద్ర కరువైనట్లు స్వయంగా బాబు చెబుతున్నారని ఆయన మానసపత్రిక ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. మరి చంద్రబాబు ఇంతగా ఆందోళన చెందుతున్నారంటే ఆయన కూడా తప్పు చేసి ఉంటారని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. అదే నిజమై పక్కా ఆధారాలతో బాబుపై కేసు నమోదు చేస్తే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి. మొత్తానికి రేవంత్‌ ఎపిసోడ్‌ రెండు రాష్ట్ల్రాల్లోనూ తీవ్ర ఆసక్తిని రేకిత్తిస్తోంది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ