Advertisement

విద్యార్థులకు, కేసీఆర్‌కు మధ్య మరో చిచ్చు..!!

Tue 19th May 2015 09:44 AM
o students,agitation,kcr,land,job notification  విద్యార్థులకు, కేసీఆర్‌కు మధ్య మరో చిచ్చు..!!
విద్యార్థులకు, కేసీఆర్‌కు మధ్య మరో చిచ్చు..!!
Advertisement

కేసీఆర్‌కు ఉస్మానియా విద్యార్థులకు మధ్య వివాదం ముదురుతోంది. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఒక్క నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదని ఇప్పటికే విద్యార్థులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. దీనికితోడు ఇటీవలే కేసీఆర్‌ చేసిన ఓ ప్రకటన విద్యార్థులను మరింత రెచ్చగొట్టుంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, వాటిల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తుందని కేసీఆర్‌ ప్రకటించారు.

అయితే దీన్ని  ఓయూ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేసీఆర్‌ ప్రకటనకు వ్యతిరేకంగా మంగళవారం విద్యార్థులు ధర్నా నిర్వహించి కేసీఆర్‌ చిత్రపటాన్ని దహనం చేశారు. ఓయూ జోలికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. అయితే టీఆర్‌ఎస్‌ వర్గాలు మాత్రం విద్యార్థుల ఆందోళనను తేలికగా తీసుకుంటున్నాయి. ఓయూలో ఖాళీగా ఉన్నా స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయని, దీనికిబదులుగా పేదలకు పంచితే తప్పేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక తెలంగాణ ఆవిర్భవించి ఏడాది కాలం కావస్తున్న సందర్భంగా నిర్వహించే సంబరాల్లో భాగంగా ఉద్యోగ నోటిఫికేషన్‌లు, కాంట్రాక్ట్‌ కార్మికుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని కూడా వారు చెబుతున్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement