Advertisement

వామ్మో.. కేసీఆర్‌కే షాకిచ్చారు..!!

Tue 19th May 2015 05:57 AM
kcr,fitment,employees union,ravindra reddy  వామ్మో.. కేసీఆర్‌కే షాకిచ్చారు..!!
వామ్మో.. కేసీఆర్‌కే షాకిచ్చారు..!!
Advertisement

ఉద్యోగ సంఘాలను ఆకట్టుకోవడానికి కేసీఆర్‌ చేయని ప్రయత్నం లేదు. టీఎన్జీవో నేతలను రాజకీయాల్లోకి తీసుకొచ్చి పలు పదవులను కట్టబెట్టారు. అంతేకాకండా వారు అడిగిన డిమాండ్‌ మేరకు గతంలో ఎన్నడూ లేనంత పెద్ద మొత్తంలో ఏకంగా 43శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించారు. ఆ వెంటనే కేసీఆర్‌ చిత్రపటాలకు ప్రభుత్వ ఉద్యోగులు కూడా క్షీరాభిషేకాలు చేసి కేసీఆర్‌ అంతటి నాయకుడు లేడని చెప్పుకొచ్చారు. అదంతా నిన్నటి మాట. ఈ రోజు ఉద్యోగ సంఘాల నాయకుల మాట తీరులో వచ్చిన మార్పు టీఆర్‌ఎస్‌ వర్గాలను షాక్‌కి గురిచేస్తోంది. ఈ ఏడాది పాలన కాలంలో టీఆర్‌ఎస్‌తో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని టీఎన్జీవోల అధ్యక్షుడు రవీంద్రారెడ్డి వ్యాఖ్యానించడం పలువుర్ని విస్మయానికి గురిచేసింది.

'మన రాష్ట్రం-మన ఉద్యోగులు' అనే కార్యక్రమంలో మాట్లాడిన పలువురు ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. ఫిట్‌మెంట్‌ను ఏరగా వేసి విభజన సమస్యలను కేసీఆర్‌ పక్కదారి పట్టించారని వ్యాఖ్యానించారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ఏడాది కాలానికి కూడా తాము ఇంకా సీమాంధ్ర అధికారుల కిందే పనిచేస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కమల్‌నాథన్‌ కమిటీ ఉద్యోగులను విభజించకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. అయితే 43 శాతం ఫిట్‌మెంట్‌తో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఇక ఎప్పటికీ తమ వెంటే ఉంటారని భావించిన టీఆర్‌ఎస్‌ శ్రేణులకు ఈ మాటలు మింగుడుపడటం లేదు. ఈ వ్యాఖ్యలు విన్న వారంతా ఖంగుతింటున్నారు. కేసీఆర్‌తో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేకున్నా.. ఉద్యోగులు మాత్రం బాగానే లాభపడ్డారు కదా.. ఇప్పుడు ఆ విషయాన్ని మరిచి విమర్శలకు దిగడం వింతగా ఉందని గులాబిదళం నాయకులు 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement