Advertisement

చైనా సరిహద్దు సమస్య పరిష్కారం దిశగా మోదీ..!

Sat 16th May 2015 11:36 PM
narendhra modi,bangladesh,china,nehru,indiragandi  చైనా సరిహద్దు సమస్య పరిష్కారం దిశగా మోదీ..!
చైనా సరిహద్దు సమస్య పరిష్కారం దిశగా మోదీ..!
Advertisement

ఏనుగు బలమయిందే, కాకపోతే సాధు జంతువు. అదే సమయంలో డ్రాగన్‌ మరింత ప్రమాదకరమయింది. తనకన్నా బలవంతుడు తన పొరుగువాడయితే ఎంత అప్రమత్తంగా వుండాలో మోదీ నిరూపించారు. అదే సమయంలో భారత్‌ ఆత్మ గౌరవానికి భంగం కలగకుండా ప్రోటోకాల్‌ నిబంధనలను పక్కనపెట్టి దేశాధ్యక్షుడే స్వయంగా స్వాగతం పలికేలా చేశారు జననేత మోదీ - బౌద్ధ ఆలయాలు దర్శించడం, బోధి మొక్కని కానుకగా ఇవ్వడం చైనా ప్రజల హృదయాలను జయించే ప్రయత్నం. అదే సమయంలో మీడియా గౌరవాన్ని అందుకున్నారు మోదీ. బౌద్ధాన్ని ఇరుదేశాల మధ్య స్నేహ వారధిగా వినియోగించుకున్న మోదీ అధినాయకత్వంతో కీలక విషయాల ప్రస్తావనలో రాజీపడలేదు. కుండబద్దలు కొట్టినట్టు సరిహద్దు వివాదం, పాక్‌ ఆక్రమిత కాశ్మీరులో పెట్టుబడులను ప్రస్తావించి రాజకీయ పండితుల ప్రశంసలూ అందుకున్నారు. నిన్న బంగ్లాతో సరిహద్దు సమస్యని పరిష్కరించుకున్న మోదీ నేడు చైనాతోనూ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవడం అభినందనీయం. మోదీ తీసికెళ్ళిన ‘బోధి’ మొక్క మ్రానవడానికి కాలంపడుతుంది. అలాగే నెహ్రూ, శాస్త్రి, ఇందిర, రాజీవ్‌, వాజ్‌పేయి, మన్మోహన్‌ కాలం నుంచి పేరుకుపోయిన వైషమ్యాల హిమపర్వతం కరగడానికి కొంతకాలంపడుతుంది. చైనా ప్రజల మైండ్‌సెట్‌ మారేవరకు ఓపిగ్గా వేచిచూడాల్సిందే, ఎంత త్వరగా ఆర్ధికంగా భారత్‌ పుంజుకుంటే అంత త్వరగా చైనా నాయకత్వం మైండ్‌సెట్‌ మారుతుంది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement