Advertisement

కలవరపడి ధర్నాలకు దిగుతున్న బీజేపీ..!!

Sat 16th May 2015 06:50 AM
bjp,dharna,ghmc,elections,trs  కలవరపడి ధర్నాలకు దిగుతున్న బీజేపీ..!!
కలవరపడి ధర్నాలకు దిగుతున్న బీజేపీ..!!
Advertisement

గ్రేటర్‌లో పాగా వేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. డిసెంబర్‌లోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఇప్పటినుంచి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బీజేపీ రాష్ట్ర అధిష్టానం చర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగా వరుసగా గురు, శుక్రవారాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ధర్నాకు దిగారు.

తెలంగాణలో అర్బన్‌ ప్రాంతంలో బీజేపీకి మంచి పట్టుంది. ఇక హైదరాబాద్‌ విషయానికొస్తే మోడీ మానియా, టీఆర్‌ఎస్‌ వ్యతిరేకత, సీమాంధ్రులు బీజేపీకి కలిసొచ్చే అంశాలు. ఇక ఎంఐఎం పటిష్టంగా ఉన్న ప్రాంతాలను వదిలిపెడితే మిగిలిన స్థానాల్లో బీజేపీయే రేసులో ముందుంది. ఇక హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమాలతో నగరంలో టీఆర్‌ఎస్‌ బలంగా తయారవడానికి పావులు కదుపుతోంది. దీనికితోడు గ్రేటర్‌ పరిధిలో పలువురు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడంతో క్రమంగా గులాబి దళం బలపడుతోంది. దీంతో మేల్కొన్న బీజేపీ వరుసగా ధర్నా కార్యక్రమాలు చేపడుతూ గ్రేటర్‌వాసులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. స్వచ్ఛ హైదరాబాద్‌లో తమను భాగస్వాములను చేయలేదంటూ గురువారం ఆందోళన చేసిన బీజేపీ నాయకులు శుక్రవారం గ్రేటర్‌లో ఆస్తి పన్నులు తగ్గించాలంటూ ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో కిషన్‌రరెడ్డి, లక్ష్మణ్‌, ఎమ్మెల్యే ప్రభాకర్‌వంటి అగ్రనాయకులు పాల్గొన్నారు. దీన్నిబట్టి గ్రేటర్‌ ఎన్నికలను బీజేపీ ఎంత సీరియస్‌గా తీసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement