నేపాల్‌లో మిస్సయిన మాజీ హోంమంత్రి తనయుడు..!!

Thu 14th May 2015 11:47 AM
veerender goud,nepal earth quake,missing,devendergoud  నేపాల్‌లో మిస్సయిన మాజీ హోంమంత్రి తనయుడు..!!
నేపాల్‌లో మిస్సయిన మాజీ హోంమంత్రి తనయుడు..!!
Advertisement

మాజీ హోంమంత్రి దేవేందర్‌గౌడ్‌ తనయుడు వీరేందర్‌గౌడ్‌ నేపాల్‌ దేశంలో చిక్కుకుపోయారు. గతంలో వచ్చిన భూకంపంతో అతలాకుతలమైనా నేపాల్‌లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీరేందర్‌గౌడ్‌ మరో 15 మంది అనుచరులతో కలిసి ఆ దేశం వెళ్లాడు. అక్కడ ముమ్మరంగా కొనసాగుతున్న సహాయ కార్యక్రమాల్లో వీరేందర్‌గౌడ్‌ కూడా తన బృందంలో కలిసి పాల్గొన్నాడు. ఇంతలోనే మరోసారి భూకంపం వచ్చింది. ఇక అప్పటినుంచి కూడా వీరేందర్‌గౌడ్‌ ఆచూకీ తెలియకుండా పోయినట్లు సమాచారం. ఆయన సెల్‌ఫోన్‌ అందుబాటులో లేదని, బృందం సభ్యుల్లో ఎవరి సమాచారం కూడా లేదని వీరేందర్‌గౌడ్‌ తండ్రి దేవేందర్‌గౌడ్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

దేవేందర్‌గౌడ్‌ తనయుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన వీరేందర్‌గౌడ్‌ మహేశ్వరంలో తనదైన శైలిలో టీడీపీని ముందుకు నడుపుతున్నాడు. 2014 ఎన్నికల్లో చేవెళ్ల నుంచి ఎంపీగా పోటీచేసిన ఆయన మూడోస్థానంతో సరిపెట్టుకున్నాడు. అయినప్పటికీ పశ్చిమరంగారెడ్డిలో ప్రస్తుతం ఆయన టీడీపీకి పెద్దదిక్కుగా ఉన్నాడు. ఇక నేపాల్‌ ఆయన జాడ తెలియకపోవడంతో తెలుగు పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. వీరేందర్‌గౌడ్‌ ఆచూకీ కోసం ఆర్మీ హెలిక్యాప్టర్‌లను వినియోగించాలని దేవేందర్‌గౌడ్‌ విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌కు, విమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజుకు విజ్ఞప్తి చేశాడు.


Loading..
Loading..
Loading..
advertisement