Advertisement

మెట్రోపై వెనక్కి తగ్గిన కేసీఆర్‌..!!

Wed 13th May 2015 04:08 AM
kcr,metro,alignment change,l&t  మెట్రోపై వెనక్కి తగ్గిన కేసీఆర్‌..!!
మెట్రోపై వెనక్కి తగ్గిన కేసీఆర్‌..!!
Advertisement

మెట్రో అలైన్‌మెంట్‌ విషయమై అటు కేసీఆర్‌కు ఇటు ఎల్‌అండ్‌టీకి మధ్య తీవ్ర విబేధాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓ సమయంలో తాము ప్రాజెక్టునుంచి తప్పుకుంటామని, ఇప్పటివరకు అయిన ఖర్చును టీ-ప్రభుత్వం చెల్లించాలని కూడా ఎల్‌అండ్‌టీ తేల్చిచెప్పింది. ఆ తర్వాత కొన్ని చోట్ల మాత్రమే అలైన్‌మెంట్‌ మార్పు చేయాలని కేసీఆర్‌ సర్కారు మెట్టుదిగిరావడంతో ఎల్‌అండ్‌టీ కూడా కొంత వెనక్కి తగ్గింది. అయితే ఇప్పుడు ఆ చిన్నపాటి మార్పులు కూడా ఉండే అవకాశం కనబడటం లేదు. మంగళవారం మెట్రోపై జరిగిన సమీక్ష సమావేశంలో ఎక్కడా అలైన్‌మెంట్‌ మార్పు గురించి ప్రస్తావన రాకపోవడం దీన్ని బలపరుస్తోంది.

 ఇప్పుడున్న మార్గాలకుతోడు అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో రెండు మార్గాలు వేయాలని కేసీఆర్‌ నిర్ణయించారు. రాయదుర్గం నుంచి శంషాబాద్‌కు అలాగే ఫలక్‌నుమా మీదుగా అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో మార్గం వేయాలని కేసీఆర్‌ ఆదేశించారు. అంతేకాకుండా ఎల్‌బీ నగర్‌, చంద్రాయణగుట్టల మీదుగా శంషాబాద్‌ వరకు మెట్రోను విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికోసం మొత్తం 2 వేల కోట్ల రూపాయలను కేటాయించినట్లు కేసీఆర్‌ ప్రకటించారు. వీటికి సంబంధించి స్థల సేకరణ పనులను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. ఇక ఇప్పటివరకు పనులు మొదలైన మూడు మార్గాల్లో 72 కిలోమీటర్లకు 19 కిలోమీటర్ల మేర మెట్రో పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. మిగిలిన పనులను కూడా చాలా వేగవంతంగా పూర్తిచేస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement