Advertisement

సినీజోష్ ఇంటర్వ్యూ: రుద్రపాటి రమణారావు

Sat 09th May 2015 06:24 AM
rudhrapati ramanarao,lion movie,balakrishna,fight scenes  సినీజోష్ ఇంటర్వ్యూ: రుద్రపాటి రమణారావు
సినీజోష్ ఇంటర్వ్యూ: రుద్రపాటి రమణారావు
Advertisement

'లెజెండ్' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బాలయ్య ప్రస్తుతం సత్యదేవా దర్శకత్వంలో ఎస్.ఎల్.వి.సినిమా పతాకంపై రుద్రపాటి రమణరావు నిర్మిస్తున్న సినిమా 'లయన్'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు ముగించుకొని మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో నిర్మాత రుద్రపాటి రమణారావుతో సినీజోష్ ఇంటర్వ్యూ..

సినిమా ఎలా ఉండబోతోంది..?

ఇదొక కమర్షియల్, ఫ్యామిలీ ఎంటర్ టైనింగ్ సినిమా. ఈ మూవీలో బాలకృష్ణ గారు రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నారు. మంచి కథ. ప్రతి సీన్, ప్రతి ఫైట్ చాలా కొత్తగా ఉంటాయి. సెకండ్ హాఫ్ లో మాస్ ఫైట్స్ ఉంటాయి. సొసైటీ నేపధ్యంలో చిత్రాన్ని తెరకెక్కించాం. భారీ బడ్జెట్ తో ఎక్కడా కాంప్రమైస్ అవ్వకుండా తీసిన చిత్రమిది. ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

'లయన్' అనే టైటిల్ పెట్టడానికి కారణం ఏమిటి..?

నేను బాలయ్య గారికి పెద్ద అభిమానిని. ఆయన చేసిన చిత్రాల స్పూర్తితో ఈ చిత్రాన్ని నిర్మించాను. హీరోగానే కాకుండా ఒక మనిషిగా, రాజకీయనాయకుడిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన సినిమాకి ఈ టైటిలే యాపట్ అవుతుందని పెట్టాం. టైటిల్ కు తగ్గట్లుగానే సినిమాలో ఆయన నటన కూడా ఉంటుంది.

సత్యదేవా ఎలా డైరెక్ట్ చేసారు..?

ముందు వేరే డైరెక్టర్ తో వేరే కథ చేయాలనుకున్నాను. సత్యదేవా చెప్పిన కథ నచ్చింది. బాలయ్య ను రొటీన్ గా కాకుండా భిన్నంగా చూపించాలని ఈ సినిమా చేసాం. సత్య కొత్త దర్శకుడైనా టేకింగ్ అంతా బాగా చేసాడు. సాంగ్స్, ఫైట్స్ తో ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టాం. కృష్ణుడి మీద ఒక పాట, ఇంటర్వెల్ ముందు సంగీత్ సాంగ్, సెకండ్ హాఫ్ లో వచ్చే మాస్ సాంగ్ అధ్బుతంగా వచ్చాయి.

ప్రకాష్ రాజ్ గారి పాత్ర ఎలా ఉంటుంది..?

లక్ష్మి నరసింహ సినిమా తరువాత ప్రకాష్ రాజ్ గారు ఓ పవర్ ఫుల్, ఇంటెలిజెంట్ రోల్ కనిపించనున్నారు. ఈ మూవీతో ఆయనకు ఇంకా మంచి పేరు వస్తుంది.

ఒక అభిమానిగా మీకు ఈ సినిమా ఎలా అనిపించింది..?

ఓ నిర్మాతగా సినిమా చేసినందుకు సాటిస్ ఫై అయ్యాను. ఓ అభిమానిగా నాకు ఈ సినిమా చాలా నచ్చింది. ఫస్ట్ హాఫ్ లో బాలయ్య గారి గెటప్ నాకు చాలా నచ్చింది. మొదటి కాపీ చుసిన వారంతా కూడా చాలా బావుందని చెప్పారు.

సినిమాలో హైలైట్స్ ఏంటి..?

ఇంటర్వెల్ ఫైట్, సెకండ్ హాఫ్ లో వచ్చే ట్రైబల్ ఫైట్ చాలా కొత్తగా ఉంటాయి. క్లైమక్స్ ఫైట్ ఎఫెక్టివ్ గా ఉంటుంది.  

సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎందుకు డిలే అవుతుంది..?

సినిమా సిజి వర్క్ డిలే అవ్వడం వలన సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేసాం. బ్యాక్ గ్రౌండ్ వర్క్ అంతా చెన్నై లో జరగడం డి.టి.ఎస్. చేసే మధుసూదన్ గారు చనిపోవడం ఇతరత్రా కారణాల వలన లేట్ చేసాం.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

నా తరువాత సినిమా కూడా బాలకృష్ణ గారితో చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఆయన తన 100 వ సినిమాలో బిజీ గా ఉన్నారు. 101 వ సినిమా చేసే అవకాశం నాకు ఇస్తే ఖచ్చితంగా చేస్తాను.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement