Advertisementt

రాజకీయాలలోకి సి.ఎం కోడలు..!

Thu 07th May 2015 11:23 AM
brahmani,chandrababu,lokesh,ntr,purandareshwari  రాజకీయాలలోకి సి.ఎం కోడలు..!
రాజకీయాలలోకి సి.ఎం కోడలు..!
Advertisement
Ads by CJ

నవ్యాంధ్ర నిర్మాణానికి చంద్రబాబు కుటుంబం అంకితమయింది. ముఖ్యమంత్రిగా కాక ‘సిఈఓ’గా చంద్రబాబు వ్యవహారాలను చక్కబెడుతున్నారు. చంద్రబాబు కుమారుడు లోకేష్‌ కూడా తండ్రి అడుగు జాడలలో దూసుకుపోతున్న వైనం చూడ ముచ్చటగా వుంది. లోకేష్‌ అమెరికా పర్యటన ఆశాజనంకంగా కనిపిస్తోంది. రేపటి రోజున తెలుగుదేశం పార్టీకి పెద్ద పోటీదారుగా బిజెపి అవతరించనున్నది. తెలుగునాట ఎన్టీఆర్‌ కుమార్తెగా పురంధేశ్వరి ప్రభంజనం కనిపించే సూచనలున్నాయి. పురంధేశ్వరి గ్లామర్‌ని నిర్వీర్యం చేయగల సత్తా ఎన్టీఆర్‌ మనవరాలు - బాలకృష్ణ కుమార్తె - చంద్రబాబు కోడలు - లోకేష్‌ భార్య బ్రాహ్మణికి మాత్రమే వుంది. ఇందిరాగాంధీ వారసురాలిగా ఆమె మనవరాలు ప్రియాంకని ప్రజలు ఎలా కోరుకుంటున్నారో అలాగే తెలుగు తమ్ముళ్ళు ఎన్టీఆర్‌ మనవరాలు బ్రాహ్మణికి బ్రహ్మరధం పట్టడం ఖాయం. ఎమ్మెస్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ అయిన బ్రాహ్మణి రూప రేఖాలావణ్యాలేకాదు వేదికపై ఆమె ఉపన్యాసాలు, హావభావాలు అద్భుతం అంటున్నారు సెమినార్లలో ఆమెతో వేదికను పంచుకున్న ఎన్నారై మిత్రులు. రేపటి తరానికి ప్రతినిధి అయిన బ్రాహ్మణి సంధించే సమ్మోహనాస్త్రానికి నిన్నటితరం పురంధేశ్వరి నిలువలేదని పత్రికా వర్గాల కథనం. ఇటీవలే చంద్రబాబుకి తాతగా ప్రమోషన్‌ ఇచ్చిన బ్రాహ్మణికి ఆంధ్రా రాజకీయాలు, స్థల పురాణం, ఎన్టీఆర్‌ ప్రసంగశైలిలో శిక్షణ ఇస్తున్నట్లు భోగట్టా.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ