Advertisement

'మా' సేవా కార్యక్రమాలు మొదలు..!

Fri 01st May 2015 06:32 AM
rajendhraprasad,kadambari kiran,movie artist association  'మా' సేవా కార్యక్రమాలు మొదలు..!
'మా' సేవా కార్యక్రమాలు మొదలు..!
Advertisement

'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కార్యవర్గం సభ్యులు సేవా కార్యక్రమాలు మొదలు పెట్టారు. ముందుగా పెన్షన్ల పంపిణీతో మొదలు పెట్టి 'మా' ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ పలువురు సినీ ఆర్టిస్టులకు చెక్ లను అందించారు. ఈ కార్యక్రమంలో కాదంబరి కిరణ్ మాట్లాడుతూ "'మా' ఆర్ధిక సహాయం చేసే దిశలో నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ గారి నేతృత్వంలో పెన్షన్ల కార్యక్రమాలు పునరుద్ధరింపజేస్తున్నాం" అని చెప్పారు.

శివాజీరాజా మాట్లాడుతూ "కొన్ని అనివార్యకారణాల వలన పెన్షన్ కార్యక్రమాలు నిలిపివేశారు. మా ప్యానల్ గెలిచిన తరువాత నలబై నుండి యాబై మంది వరకు ముందు పెన్షన్లు ఇవ్వాలని నిశ్చయించుకున్నాం. మీటింగ్స్ పెట్టి మరికొంత మందికి పెన్షన్స్ లభించేలా చూస్తాం. ఎవరికి ఇబ్బంది వచ్చిన ఆర్ధిక సహాయం చేయడానికి ముందుగా మా టీమ్ సిద్ధంగా ఉంటుంది. ఎలక్షన్స్ లో చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేరేలా చూస్తాం" అని చెప్పారు.

శ్రీరాం ఏడిద మాట్లాడుతూ "బీద కళాకారులకు ఆర్ధిక సహాయం చేయాలని ఎలక్షన్స్ కి ముందే నిశ్చయించుకున్నాం. పెన్షన్స్ ఇవ్వడంతో పాటు త్వరలోనే ఉచిత వైద్య శిబిరాలు, ఇన్సురన్స్ లు అందివ్వడానికి కృషి చేస్తున్నాం" అని చెప్పారు.

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ "ప్రపంచ కార్మికదినోత్సవం సందర్భంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టడం ఆనందంగా ఉంది. పెన్షన్స్ ఇవ్వడం బిడ్డలుగా మా భాద్యత. ప్రస్తుతం మేము ఎంత ఇస్తున్నామో అది సరిపోదు కాబట్టి త్వరలోనే అందరు ఆశ్చర్యపోయే విధంగా పెంచుతాం. మాకు వెన్నుదండుగా నిలిచినా మెగాస్టార్ చిరంజీవి గారికి, నాగబాబు కి నా ధన్యవాదాలు. ప్రమాణ స్వీకారం చేస్తున్నరోజే నాగబాబు కొంత డబ్బును చెక్ రూపంలో అందించారు. వారే కాకుండా వారి కుటుంబ సభ్యులతో కూడా విరాళాలు అందించారు. మా అసోసియేషన్ నుండి ఒక రూపాయి కూడా తీసుకోకుండా, ఆలస్యం చేయకుండా సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాం. అర్హులైన వారందరికి సేవా కార్యక్రమాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం" అని తెలిపారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement