Advertisement

‘దీవార్‌’ నుంచి ‘ok బంగారం, 365’ డేస్‌ వరకు!!

Mon 27th Apr 2015 12:05 AM
maniratnam,ok bangaram,diwaar,365 days  ‘దీవార్‌’ నుంచి ‘ok బంగారం, 365’ డేస్‌ వరకు!!
‘దీవార్‌’ నుంచి ‘ok బంగారం, 365’ డేస్‌ వరకు!!
Advertisement

వెండితెరపై ధైర్యంగా ఓ అగ్రనటుడు, నటి ప్రధాన పాత్రులుగా ‘సహజీవనం’ని చూపించి, ప్రేక్షకులను మెప్పించిన  చిత్రం ‘‘దీవార్‌’’. అమితాబ్‌, పర్వీన్‌ బాబీ మధ్య సహజీవనం. సలీమ్‌ ` జావెద్‌ రచయితలు. అయితే చిత్రంలోని యాక్షన్‌ సీన్స్‌, అన్నాదమ్ములుగా నటించిన అమితాబ్‌, శశికపూర్‌ మధ్య సెంటిమెంటల్‌ డైలాగులు, తల్లీకొడుకుల మధ్య మెలోడ్రామా గొప్పగా పండటంతో ‘సహజీవనం’ అంశానికి అంతగా ప్రాధాన్యతరాలేదు. మహేష్‌భట్‌ ఇదే వృత్తాన్ని తీసుకొని జనరంజకంగా చిత్రాలు తీశారు. తెలుగులో దాసరి ‘కన్యకుమారి’, ‘పెద్దిల్లు చిన్నిల్లు’ చిత్రాలు చేశారు. టెక్నాలజీ మన జీవితాలను, సంప్రదాయాలను ప్రభావితం చేస్తున్న నేపధ్యంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగస్తులు, నెటిజన్స్‌ అవసరాలు జీవిత ప్రాధాన్యతలు మారిపోయాయి. డాలర్‌ డ్రీమ్స్‌ సహజీవనాన్ని పెంచి పోషిస్తున్నాయి.

ఈ నేపధ్యంలో మణిరత్నం వంటి మేధావి తీసిన ‘ఒకే బంగారం’ కాన్సెప్టుపరంగా యువతని బాగా ఆకట్టుకుంది. రామ్‌ గోపాలవర్మ ‘365 డేస్‌’ విడుదలకు ముందే హాట్‌ టాపిక్‌గా మారింది. ‘సహజీవనం’ తెలుగు సినిమా పరిశ్రమకు కొత్తకాదు. కళను, కళాకారులను ప్రేమించిన వారెందరెందరో తెలుగునాట. శారీరక సంబంధానికి మించిన ఆత్మీయ బంధం అది. బాలచందర్‌, విస్సు, భారతీరాజా, భాగ్యరాజా ప్రారంభించిన ‘ఆఫ్‌బీట్‌’ కథ, కథనం మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ రూపంలో ప్రేక్షకులముందుకి రావడం అభినందనీయం. ఒకప్పుడు రైతు పోరాటం, జమీాందారీతనం, బాల్యవివాహాలు, విధవా వివాహాలు, అంటరానితనం, మాంగల్యాన్ని తీసేయడం నాటి సామాజిక సమస్యలు. నేడు సహజీవనం సామాజిక జీవనం. లో బడ్జెట్‌ చిత్ర రచయితలు దర్శకులు  స్టోరీ కాన్పెస్టు ప్రధాన ఆకర్షణగా వుండేలా చూడాలి. ఇక్కడ కాన్పెప్టే హీరో. కొత్త నీటిని స్వాగతిద్దాం.

- తోటకూర రఘు

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement