కొత్త 'మా' ప్రెసిడెంట్ కి ఓ వినతి..!

Sun 19th Apr 2015 02:12 PM
maa,rajendra prasad,media,writers,movie artist association  కొత్త 'మా' ప్రెసిడెంట్ కి ఓ వినతి..!
కొత్త 'మా' ప్రెసిడెంట్ కి ఓ వినతి..!
Advertisement

రాజా, సినీ పాత్రికేయులనూ ఓ క్రాఫ్ట్‌గా గుర్తించి సభ్యత్వం ఇవ్వండి

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షునిగా ఎంపికయిన రాజేంద్రప్రసాద్‌కి, కార్యవర్గ సభ్యులకు అభినందనలు. ఈ సందర్భంగా మా వినతి : సినిమా ప్రకటించిన రోజు నుంచి సినిమా విడుదలయి సక్సెస్‌మీట్‌ జరుపుకునే వరకు ఆ సినిమా ఫొటోలు, ఆసక్తికరంగా వార్తా కథనాలు అందించి ప్రేక్షకులలో ఓ క్రేజ్‌ తీసుకొచ్చేది సినిమా పాత్రికేయులే. జాతీయస్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సినిమా అవార్డులతోపాటు ఈ పాత్రికేయులకూ అవార్డులు అందిస్తున్నారు. కానీ పరిశ్రమ ఈ సినీ పాత్రికేయులను ఓ క్రాఫ్ట్‌గా గుర్తించి, ఫిలిమ్‌ ఛాంబర్‌లో సభ్యత్వం కల్పించవలసిన అవసరం వుంది. ఈ సందర్భంగా ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ చొరవతీసుకొని ఫిలిమ్‌ జర్నలిస్టులకి ఓ గుర్తింపు, గౌరవం, సభ్యత్వం కల్పిస్తారని ఆశిద్దాం. ఫిలిమ్‌ చాంబర్‌లో సభ్యత్వం, ఓ హోదా అంతకుమించి గౌరవం, జీవ సాఫల్యం: సినీ ఉమ్మడి కుటుంబంలో సబ్యత్వాన్నిమించిన గౌరవం వేరొకటిలేదు.

-తోటకూర రఘు


Loading..
Loading..
Loading..
advertisement