Advertisement

టీ-సర్కారు నిర్లక్ష్యం చూస్తే అవాక్కవ్వాలిందే..!!

Tue 07th Apr 2015 08:04 AM
farmers,telangana,suicide,kcr  టీ-సర్కారు నిర్లక్ష్యం చూస్తే అవాక్కవ్వాలిందే..!!
టీ-సర్కారు నిర్లక్ష్యం చూస్తే అవాక్కవ్వాలిందే..!!
Advertisement

ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో అటు తెలంగాణలో ఇటు ఏపీలోనూ రైతులు తీవ్ర దుర్భిక్షంలో కొట్టుమిట్టాడుతున్నారు. దీనికితోడు తెలంగాణలో కరెంటు కోతలతో రైతులకు పెట్టుబడి కూడా వెనక్కివచ్చే పరిస్థితి లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు కంటే కూడా ఈసారి అధిక సంఖ్యలో రైతుల ఆత్మహత్యలు చోటుచేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఎన్నికల ముందు రైతుల కాళ్లలో ముల్లు కుచ్చుకుంటే నోటీతో తీస్తానన్న కేసీఆర్‌ అధికారంలోకి రాగానే వారి గురించి పట్టించుకోవడం మానేశాడని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అది నిజమనే రీతిలో తెలంగాణలో రైతులు ఇంతటి ఇబ్బందుల్లో ఉన్నా.. కరువుసాయంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. టీ-రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధమోహన్‌సింగ్‌ను టీడీపీ నాయకులు కలుసుకోగా.. ఆయన రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు కరువుసాయంపై ఎలాంటి అభ్యర్థన రాలేదని చెప్పడం గమనార్హం. ఇక రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రితో తానే మాట్లాడి తెలంగాణ రైతులను ఆదుకుంటానని రాధామోహన్‌సింగ్‌ హామీనిచ్చినట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. గతంలో తెలంగాణలో కరెంటు కోతలు తీవ్రంగా ఉన్నా అదనపు విద్యుత్‌ను కేటాయించాలంటూ తమకు ఎలాంటి అభ్యర్థన రాలేదని కేంద్రం చెప్పింది. ఇప్పుడు రైతుల విషయంలోనూ ఇదే నిర్లక్ష్యం పునరావృతమైంది. దీన్నిబట్టి తెలంగాణ సర్కారుకున్న ముందుచూపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement