Advertisement

ఇటు ఏపీ.. అటు తెలంగాణలో నేరచరితులు మస్తుగున్నారు..!!

Sun 05th Apr 2015 11:25 AM
neracharithulu,mla,ap,telangana  ఇటు ఏపీ.. అటు తెలంగాణలో నేరచరితులు మస్తుగున్నారు..!!
ఇటు ఏపీ.. అటు తెలంగాణలో నేరచరితులు మస్తుగున్నారు..!!
Advertisement

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు భౌగోళికంగా వేరే అయినప్పటికీ.. ఆ రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సారూప్యతలు అలాగే కొనసాగుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అధికారపార్టీల్లోని ఎమ్మెల్యేలపైనే అధికంగా కేసులుండటం మరో ప్రత్యేకత. సుపరిపాలన వేదిక తరఫున ఈ విషయంపై అధ్యయనం చేసిన మాజీ జడ్జి మారెప్ప నివేదిక ప్రకారం.. ఏపీలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేల్లో 60 మంది నేరచరితులున్నారు. ఇక్కడ అధికారపార్టీ అయిన టీడీపీలో 36 మందిపై, ప్రతిపక్ష పార్టీ అయిన వై. కాంగ్రెస్‌లో 22 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇక ఒక బీజేపీ ఎమ్మెల్యేపై, ఒక ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేపై కేసు నమోదయ్యాయి. ఇక తెలంగాణ విషయానికొస్తే.. మొత్తం 119 మంది ఎమ్మెల్యేల్లో 38 మంది ఎమ్మెల్యేలపై కేసులు నమోదయ్యాయి. వీరిలో అధికారిక పార్టీ టీఆర్‌ఎస్‌ నుంచి 22 మంది ఎమ్మెల్యేలపై, మజ్లిస్‌కు చెందిన ఐదుగురిపై, కాంగ్రెస్‌, టీడీపీల్లో చెరో నలుగురిపై అలాగే బీజేపీ నుంచి ఒక ఎమ్మెల్యేకు నేర చరిత్ర ఉంది. రాష్ట్రాలు రెండు వేరైనా ప్రజలు మాత్రం నేరచరితులను గెలిపించడానికి మొగ్గుచూపడం గమనార్హం.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement