దిగాలుపడ్డ హైదరాబాద్‌ రిటైలర్స్‌- హోటల్స్‌!

Fri 03rd Apr 2015 06:15 AM
hyderabad,entry tax,hotels,retailers,feeling  దిగాలుపడ్డ హైదరాబాద్‌ రిటైలర్స్‌- హోటల్స్‌!
దిగాలుపడ్డ హైదరాబాద్‌ రిటైలర్స్‌- హోటల్స్‌!

తెలంగాణలోకి ప్రవేశించే ఆంధ్ర వాహనాలపై ‘ప్రవేశ రుసుం’ విధించడంతో మొదటిరోజునే కోటి వసూలయిందని అధికార వర్గాలు ఆనందిస్తున్నాయి. ప్రభుత్వపరమైన పనులమీద ఇతరత్రా కారణాల వల్ల హైదరాబాదు వచ్చే ఆంధ్రులతో షాపింగ్‌ మాల్స్‌, హోటల్స్‌, హాస్పిటల్స్‌, టాక్సీలు - ఆటోలు, థియేటర్లు కళకళలాడుతుండేవి. రాష్ట్ర విభజనతో షాపింగ్‌మాల్స్‌, హోటల్స్‌, టాక్సీలు డీలా పడ్డాయి. ఈ ఎంట్రీ టాక్సుతో హైదరాబాదు వచ్చే వారి సంఖ్య మరింత తగ్గడం ఖాయం. దీని ప్రభావం ఫుట్‌పాత్‌ వ్యాపారాలమీద కూడా కనిపిస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు - బిల్డింగ్‌ మెటీరియల్‌ ధరలు పెరుగుతాయి. ఇదే సమయంలో పాలన ఆంధ్రప్రదేశ్‌నుంచే సాగించమని చంద్రబాబుపైన, ఆంధ్రాలో హైకోర్టు ఏర్పాటుచేయమని కేంద్రంపైన ఒత్తిడి పెరగడం ఖాయం. వామపక్షనేతలు సురవరం, నారాయణ, రాఘవులు ఈ విషయమై కార్యాచరణకు దిగకపోవడం కొసమెరుపు.