Advertisement

ఆ మాజీ ప్రధాని పరువు నిలిచింది..!!

Wed 01st Apr 2015 07:50 AM
manmohan singh,cbi,supremecourt,coal scam  ఆ మాజీ ప్రధాని పరువు నిలిచింది..!!
ఆ మాజీ ప్రధాని పరువు నిలిచింది..!!
Advertisement

బొగ్గు కుంభకోణం కేసు కాంగ్రెస్‌ పెద్దలకు ఉచ్చు బిగుస్తోంది. ఏకంగా మాజీ ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌ను కూడా ప్రశ్నించడానికి సీబీఐ సిద్ధమైంది. ఈ కుంభకోణానికి సంబంధించి మాజీ ప్రధాని మన్‌మోహన్‌పై కూడా కేసు నమోదు చేయాలని, అతని వాంగ్మూలాన్ని నమోదు చేయాలని ఇదివరకే సీబీఐ కోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన్ను ప్రశ్నించడానికి సీబీఐ సిద్ధమవుతున్న తరుణంలో మన్‌మోహన్‌సింగ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. సీబీఐ మన్‌మోహన్‌సింగ్‌కు ప్రస్తుతానికి ప్రశ్నించడానికి వీలు లేకుండా సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. అంతేకాకుండా మాజీ ప్రధానికి నోటీసులు ఎందుకు జారీ చేయాల్సి వచ్చిందో చెప్పాలంటూ సీబీఐకి, కేంద్రానికి కూడా సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. అత్యంత నిజాయితీ పరుడైన వ్యక్తిగా పేరుగాంచిన మన్‌మోహన్‌సింగ్‌ను సీబీఐ ప్రశ్నించి ఉంటే ఓ సరికొత్త రికార్డు నమోదయ్యేది. ఓ కేసుకు సంబంధించి సీబీఐ ఇదివరకెన్నడూ ఓ మాజీ ప్రధానిని విచారించలేదు. ఒకవేళ ప్రశ్నించి ఉంటే మన్‌మోహన్‌సింగ్‌ జీవితంపై ఓ చెరగని ముద్ర పడేది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement