Advertisementt

అసెంబ్లీ సమావేశాల్లో బాబు కమిటీ ఏం తేల్చింది..??

Sat 28th Mar 2015 02:36 PM
ap assembly,tdp mlas,committee,chandra babu naidu  అసెంబ్లీ సమావేశాల్లో బాబు కమిటీ ఏం తేల్చింది..??
అసెంబ్లీ సమావేశాల్లో బాబు కమిటీ ఏం తేల్చింది..??
Advertisement
Ads by CJ

చంద్రబాబునాయుడు ఏ పనిచేసినా పక్కా ప్రణాళికబద్ధంగా ఉంటుంది. ఇక ఇటీవలే జరిగిన శాసన సభ సమావేశాల్లో టీడీపీ సభ్యుల పనితీరుపై చంద్రబాబు ఓ కమిటీ వేశారు. మంత్రి అచ్చెన్నానాయుడు, చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే కేశవ్‌, ఎమ్మెల్యే దూళ్లపాళ్ల నరేంద్ర, మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఇక శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై ఈ కమిటీ ఓ నివేదిక తయారు చేసి అధినేత చంద్రబాబుకు అప్పగించింది. అయితే టీడీపీ శాసనసభ్యుల్లో కేవలం 25 మంది మాత్రమే సమావేశాల్లో చురుకుగా పాల్గొన్నారని, విపక్షాల ఆరోపణలను బలంగా తిప్పికొట్టారని ఈ కమిటీ తేల్చిచెప్పినట్లు సమాచారం. సమావేశాల్లో సీనియర్‌ సభ్యులే చురుకుగా వ్యవహరించలేదంటూ వారిలో కొందరి పేర్లను కూడా బాబుకు పంపినట్లు తెలుస్తోంది. ఇక శాసనసభలో అంత చురుకుగా లేని సభ్యులకు చంద్రబాబు క్లాస్‌ తీసుకుంటారని సమాచారం.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ