Advertisement

మెట్రోపై మరో రగడ..!!

Sat 28th Mar 2015 02:30 PM
metro project,cisf,crpf,trs,l&t  మెట్రోపై మరో రగడ..!!
మెట్రోపై మరో రగడ..!!
Advertisement

తెలంగాణ సర్కారు, మెట్రో రైల్‌ ప్రాజెక్టును చేపట్టిన ఎల్‌అండ్‌టీ సంస్థకు మధ్య అనేక విషయాల్లో విభేదాలు తలెత్తుతున్నాయి. నిన్నమొన్నటి వరకు అలైన్‌మెంట్‌ విషయంలో విభేదాలు కొనసాగిన విషయం తెలిసిందే. తాజాగా మెట్రో సంస్థ రక్షణను ఏ సంస్థకు అప్పగించాలన్న విషయంలోనూ రెండువర్గాలే ఏకభిప్రాయానికి రావడం లేదు. మెట్రో రక్షణకు సంబంధించి కనీసం ఐదువేలమంది సిబ్బంది అవసరమవుతారు. ఇందుకు రాష్ట్ర పోలీస్‌శాఖను వినియోగించుకుంటే కనీసం ఓ ఐదువేల మంది స్థానికులకు ఉపాధి దొరుకుతుందని రాష్ట్ర సర్కారు ఆలోచిస్తోంది. అయితే ఎల్‌అండ్‌టీ సంస్థ మాత్రం దీనికి ససేమిరా ఒప్పుకోవడం లేదు. సీఐఎస్‌ఎఫ్‌ లేదా సీఆర్‌పీఎఫ్‌కు ఈ బాధ్యతలు అప్పగించాలని ఎల్‌అండ్‌టీ సంస్థ వాదిస్తోంది. ఇప్పటికే దేశంలోని పలుచోట్ల మెట్రో రైలు వ్యవస్థకు ఈ రెండు సంస్థలే రక్షణ కల్పిస్తున్నాయని, హైదరాబాద్‌లోనూ ఈ బాధ్యత ఆ సంస్థల్లోనే ఓ దానికి అప్పగించడం మేలని ఎల్‌అండ్‌టీ వాదిస్తోంది. దీనికి రాష్ట్ర సర్కారు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఈ రెండు వర్గాలమధ్య మరో వివాదం రాజుకోవడానికి సిద్ధంగా ఉంది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement