Advertisement

వాగ్ధేవి వెలతెలబోయింది; క్రీడారంగం ఖిన్నురాలయింది!

Tue 10th Mar 2015 07:30 AM
womens day,sports,andhrapradesh,iit,nit,two states cms  వాగ్ధేవి వెలతెలబోయింది; క్రీడారంగం ఖిన్నురాలయింది!
వాగ్ధేవి వెలతెలబోయింది; క్రీడారంగం ఖిన్నురాలయింది!
Advertisement

మహిళాదినోత్సవానికి తళుకు బెళుకు లద్దిన ఆంధ్రా సర్కారు!

ఆమెకు భర్తలేడు -

రోజువారీ కూలీ!

అంతగా చదువుకోపోతేనేం ‘బ్రెయిన్‌ డెడ్‌’ అయిన కుమారుడి అవయవాలను దానంచేసిన మాతృమూర్తి -ధరిత్రి - చరితార్ధి!

మహిళా దినోత్సవంనాడు కృష్ణాజిల్లా కలెక్టరు ఆమెకు పాదాభివందనం చేశారు; అవయవాలను తరలిస్తున్నప్పుడు తండోపతండాలుగా ప్రజలు బారులుతీరి నివాళులర్పించారు.

- ఆ దాతృత్వం ముఖ్యమంత్రిని కదిలించలేదు కాబోలు, ఆ తల్లిని -ఆ అక్కని అభినందించాలని అనిపించలేదు కాబోలు, మహిళా దినోత్సవంనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి సత్కారం పొందిన వారిలో ఆ తల్లీ కూతుళ్ళు లేరు. లేకపోతేనేం తెలుగువారి గుండెల్లో వున్నారు.

- మెడికల్‌ రంగంలో ప్రమాణాలపరంగా అత్యున్నత సంస్థ : ఎయిమ్స్‌. ఈ మెడికల్‌ కాలేజీలో ప్రవేశానికి లక్షలాదిమంది భారతదేశంలోని నలుమూలలనుంచి వస్తారు. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌కి 2014 సంవ్సరానికి, ఓపెన్‌ కేటగిరీలో టాప్‌ ర్యాంకు సంపాదించిన చిన్నారి పి. శ్రీవిద్య, విశాఖవాసి : ఈ జాతికే గర్వకారణమైన ఆ చదువుల తల్లి ఎందరెందరికో స్ఫూర్తిదాయినిగా గౌ॥ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి గారికి కనిపించలేదు; అందుకే సత్కరించలేదు. కానీ మెడికల్‌ చరిత్రలో ఓ అధ్యాయం ఆరంభించిన ఆ చిన్నారి చిరస్మరణీయురాలు!

ఒకప్పుడు ఇంజనీరింగ్‌ - ఐఐటిల గురించి ఆంధ్రప్రదేశ్‌లో అంతగా తెలియదు. ఐఐటిలలో ప్రవేశం ఓ బ్రహ్మ విద్య. అటువంటి ఐఐటిలలో ఆంధ్రుల ప్రవేశానికి తలుపులు బార్లా తెరుచుకున్నాయి. ఐఐటిలలో దాదాపుగా 40% తెలుగు విద్యార్ధులే! ఎయిమ్స్‌ - సిఎంసి - బిహెచ్‌యు - ఐఐటిలు - ఎన్‌ఐటిలకు తెలుగువారిని ప్రతిఏటా వందలాది మందిని పంపుతున్న విద్యాసంస్థల తెలుగుజాతి రత్నాలను గౌరవించడం ద్వారా విద్యారంగంలో మనం ఎక్కడున్నామో ఘనంగా చెప్పుకునే మహదవకాశాన్ని జారవిడుచుకున్నారు గౌ॥ మన ముఖ్యమంత్రిగారు. అలాగే క్రీడారంగం, వ్యవసాయం.

రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో జరిగే కార్యక్రమం ‘స్థాయి’ దిగజార్చడం సమర్ధనీయం కాదు!

నిన్న రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు లేకుండా ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి; ఇప్పుడేమో ఇలా!

- తోటకూర రఘు

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement