Advertisement

సినీజోష్ ఇంటర్వ్యూ : శ్రుతి సోది

Mon 26th Jan 2015 12:27 PM
suthi sodi interview,patas movie,kalyan ram,anil ravipudi  సినీజోష్ ఇంటర్వ్యూ : శ్రుతి సోది
సినీజోష్ ఇంటర్వ్యూ : శ్రుతి సోది
Advertisement

 జనవరి 23 న రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ సంపాదించుకున్న సినిమా 'పటాస్'. ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించిన శ్రుతి సోది తో సినీజోష్ ఇంటర్వ్యూ...
- సినిమాలలోకి రాకముందు ఏం చేసేవారు?
పంజాబ్ లో నేను జర్నలిస్ట్ గా వర్క్ చేసాను. రెండు ఛానెల్స్ లో న్యూస్ ప్రెజంటర్  గా చేసాను. లైవ్ షోస్ కూడా చాలా చేసాను. జర్నలిస్ట్ గా నా వృత్తికి న్యాయం చేసాను. నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నాను.
- పంజాబ్ లో ఏమైనా సినిమాలలో నటించారా?

మూడు సినిమాలలో నటించాను. పంజాబ్ లో నా మొదటి సినిమా పేరు మిస్టర్ అండ్ మిసెస్ 420.

- 'పటాస్' లో నటించడానికి అవకాశం ఎలా వచ్చింది?

నాకు యాంకరింగ్ అంటే ప్యాషన్, నటనపై కూడా ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే పంజాబీలో మూడు చిత్రాలలో నటించాను. అదే సమయంలో నాకు మేనేజర్ గా పనిచేసే ఆమె తెలుగు లో ఒక సినిమాలో నటించడానికి హీరోయిన్ కావాలని చెప్పడం తో నా ఫోటోగ్రాఫ్స్ పంపించాను. నా ఫొటోస్ నచ్చి నన్ను సెలెక్ట్ చేసారు.
- కళ్యాణ్ రామ్ తో నటించడం ఎలా అనిపించింది?
తెలుగు లో నా మొదటి సినిమానే ఎన్టీఆర్ బ్యానర్ లో చేయడం చాలా సంతోషంగా ఉంది. కళ్యాణ్ చాలా ప్రొఫెషనల్ ఆన్ సెట్స్ నాకు చాలా హెల్ప్ చేసారు. తెలుగులో కొన్ని డైలాగ్స్ పలకడం రాకపోతే  డైరెక్టర్ అనిల్, కళ్యాణ్ నాకు ఆ పదాలు ఎలా ఉచ్చరించాలో చెప్పేవారు.
- తెలుగులో ఎలాంటి రోల్స్ చేయాలనుకుంటున్నారు.. పాత్ర డిమాండ్ చేస్తే బికినీ వేస్తారా?

గ్లామరస్ పాత్రల కంటే పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్  పాత్రలలో నటించడానికే ఇష్టపడతాను. క్యారెక్టర్ కి అవసరమైనవి అన్ని చేస్తాను. బికినీ వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను.

- ఈ సినిమా షూటింగ్ లో మీకు మెమొరబుల్ మూమెంట్ ఏమైనా ఉందా?

షూటింగ్ చివరి రోజున సినిమాకి పని చేసిన అందరూ ఒక చోట కలిసారు. ఈ సినిమా కోసం కష్టపడి పని చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆ రోజు నేను చాలా ఎమోషనల్ అయ్యాను. నేనేం నేర్చుకోవాలనుకున్నానో అదంతా ఈ సినిమా వల్ల నేర్చుకున్నాను. తెలుగు ప్రేక్షకులకు నచ్చే ఎక్ష్ప్రె షన్స్ నేర్చుకున్నాను.

- తెలుగు లో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమైనా సైన్ చేసారా?

ఇప్పుడే తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టాను. ఈ ఫీల్డ్ లో మంచి పేరు సంపాదించుకోవాలనుకుంటున్నాను. వెంట వెంటనే సినిమాలు రిలీజ్ చేయకుండా మంచి పాత్రలు సెలెక్ట్ చేసుకొని నటించాలని ఉంది అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement