నిన్నటివరకు ముస్లింలు; నేడు క్రిస్టియన్లు వోటు బ్యాంకుకు కనిపించేవి ఈ రెండు మతాలేనా?
హజ్ హౌస్; హజ్ యాత్ర; ఆర్ధిక వెసులుబాటు!
- నిన్నటివరకు
క్రిస్టియన్ భవన్; జెరూసలెం యాత్ర; ఆర్ధిక వెసులుబాటు; క్రిస్టియన్లకి కూడా సంక్షేమ పధకాలు!
- నేటి కొత్త పల్లవి.
మనది కర్మభూమి. భిన్న కులాలు, మతాలు, జాతులు, నైసర్గిక స్వరూపాలు, భాషలు, యాసలు. అన్ని కులాల్ని మతాల్ని గౌరవించవలసిందే. ప్రార్ధనా స్థలాన్ని పరిరక్షించవలసిందే. హైదరాబాదులో హజ్ హౌస్ వుంది; హజ్ యాత్రీకుల పర్యటనను పర్యవేక్షించే యంత్రాంగముంది; ఆర్ధిక వనరులు సమకూర్చడం జరుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ 2014 క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న సందర్భంగా పెద్దమనసు చేసుకొని అత్యంత అధునాతన సౌకర్యాలతో క్రిస్టియన్ భవన్ ని నిర్మిస్తామని వాగ్దానం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ధీటుగా స్పందించి 10 కోట్ల రూపాయలతో గుంటూరులో క్రిస్టియన్ భవన్ ని నిర్మిస్తామని; 10 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ తో క్రిస్టియన్ మైనార్టీ వెల్ఫేర్ కార్పోరేషనుని ఏర్పాటి చేస్తామని; జెరూసలెం యాత్రీకులకిచ్చే ఆర్ధికవెసులుబాటుని కొనసాగిస్తామని; షెడ్యూలు కాస్ట్స్ కి ఇచ్చే సంక్షేమ పధకాలను క్రిస్టియన్లకు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇద్దరు ముఖ్య మంత్రుల ఔదార్యం ప్రశంసనీయం. ప్రార్ధనాస్థలాల అభివృద్ధి టూరిజంని అభివృద్ధి చేస్తుంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రులిద్దరికీ మనవి : మానవ సరోవర యాత్ర - హిందువులకి అత్యంత ప్రీతిపాత్రమైంది. ఈ యాత్రీకులను కూడా కనికరించండి. కేదార్ అమరనాధ్, గోల్డెన్ టెంపుల్, కాశీ తదితర పుణ్యక్షేత్రాలలో వసతి, ఉచిత భోజన సదుపాయాలు రవాణా ఏర్పాట్లు కల్పించ మనవి.
-తోటకూర రఘు