టీడీపీ vs జనసేన: ఎలా హ్యాండిల్ చేస్తారు
TDP vs Janasena: How will it be handled?
మాజీ సీఎం గా ఉన్న చంద్రబాబు ని జగన్ ప్రభుత్వం కేసులు పట్టి జైలులో పెట్టినప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా చంద్రబాబుకి మద్దతు ప్రకటించి.. 2024 ఎన్నికల్లో కలిసి పని చేస్తున్నట్టుగా ప్రకటించారు. పొత్తు తో 2024 లో గెలిచాక చంద్రబాబు సీఎం అయ్యారు, పవన్ ని డిప్యూటీ సీఎం ని చేసారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ కి కూటమి ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించారు.
కానీ జనసేన ను టీడీపీ లో కలుపుకోవడం, టీడీపీ తో జనసేన కలిసి పని చెయ్యడం గ్రౌండ్ లెవల్ లో కొంతమంది కార్యకర్తలకు రుచించలేదు. పిఠాపురం, కాకినాడ ఇలా కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ vs జనసేన అన్నట్టుగానే పరిస్థితి ఉంది. ఎంతగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కార్యకర్తలకు నచ్చ జెప్పినా అప్పుడప్పుడు కాదు ఇప్పుడువారి మద్యన సోషల్ మీడియా వార్ తీవ్ర రూపం దాల్చింది.
జనసేన కార్యకర్తలు ఎన్టీఆర్ ను, టీడీపీ వాళ్ళు చిరంజీవి ని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్న పోస్ట్ లు కూటమి ప్రభుత్వానికి సమస్యగా మారింది. అదే అదనుగా వైసీపీ వాళ్ళు, బ్లూ మీడియా పండగ చేసుకుంటూ కూటమి లో చిచ్చు పెడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఇలా జనసేన, టీడీపీ సోషల్ మీడియా వార్ కూటమి ప్రభుత్వంపై అనుమానాలు పెంచేలా చేసింది.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో అనే విషయం కన్నా ఎక్కువగా జనసేన vs టీడీపీ సోషల్ మీడియా వార్ వెనుక ఎదో కుట్ర కోణం దాగుంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఏపీ ప్రజలు ఏ వైపుగా ఆలోచిస్తారో అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.







































