Advertisementt

అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పిల్లల ప్రతిభ

Thu 11th Apr 2024 05:20 PM
ap  అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పిల్లల ప్రతిభ
AP అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పిల్లల ప్రతిభ
Advertisement
Ads by CJ

ప్రభుత్వ పాఠశాలలను, అందులోని విద్యా బోధనా తీరుతెన్నులను మార్చేసిన సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ..  నాడు నేడు పేరిట వేలాది పాఠశాలలను ఆధునీకరించడమే కాకుండా ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టడం.. టోఫెల్ శిక్షణను సైతం అందిస్తూ పేదల పిల్లలను అంతర్జాతీయ స్థాయికి చేర్చడంలో ఎంతో కృషి చేస్తున్నారు, దీంతో అంతర్జాతీయ వేదికలతోబాటు ఐక్యరాజ్య సమితి సమావేశాల్లోనూ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు తమ ప్రతిభ చాటుతున్నారు. ఇదే క్రమంలో అంతర్జాతీయ స్థాయి టోఫెల్ పరీక్షకు ఆంధ్ర నుంచి లక్షలమంది పిల్లలు హాజరై తమ ప్రభను చూపించారు. దాదాపు 13,104 స్కూళ్లలో 3,4,5 తరగతులు చదువుతున్న 4,53,265 మంది విద్యార్థులు టోఫెల్ పరీక్షకు హాజరయ్యారు.

దీని తరువాత స్థాయిలో నిర్వహించే పరీక్షకు సైతం 5907 స్కూళ్ళకు చెందిన 6,7,8,9 తరగతుల విద్యార్థులు హాజరవుతారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 12న నిర్వహించే పరీక్షకు 16. 5 లక్షలమంది పిల్లలు హాజరు అవుతారని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ స్కూళ్లలో మురుగుపరిచిన విద్యాబోధన, ఆంగ్లం మీద పట్టుకోసం ప్రభుత్వం పడుతున్న తపన, కృషి ఇలా సత్ఫలితాలను ఇస్తోందని విద్యాశాఖ పేర్కొంది.

AP:

jagan

Tags:   AP
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ